Tirumala: తిరుమలకు వస్తే తిప్పలు తప్పవు.. శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి.. అప్పటి వరకు కొండపైకి రావొద్దని ప్రకటన | | ACTPnews

tirumala rush today


Last Updated:

Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు, విద్యార్ధులకు పరీక్షలు పూర్తవడం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది.

tirumala rush today
tirumala rush today

Tirumala: పవిత్ర పుణ్యక్షేత్రం, కోట్లాది భక్తులు వైకుంఠక్షేత్రంగా భావించే తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు, విద్యార్ధులకు పరీక్షలు పూర్తవడం, ఫలితాలు వెలువడిన నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు కొండపైకి చేరుకున్నారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్తానం పాలక మండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. 25 గంటల వరకు తిరుమల కొండపైకి భక్తులు పిల్లలు, వృద్దులు రాకూడదని సూచిస్తున్నారు. ఓవైపు వేసవి తీవ్రత, మరోవైపు రద్దీని దృష్టిలో ఉంచుకొని టీటీడీకీ సహాకరించాలని పరిస్థితిని అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం తిరుమల శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు.

తిరుమల కొండపై సమ్మర్ ఎఫెక్ట్..

తిరుమలకు భక్తులు పోటెత్తారు. సమ్మర్ హాలిడేస్, పోటీ పరీక్షలు పూర్తి కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ముక్కులు తీర్చుకునేందుకు, దర్శనం చేసుకునేందుకు తండోపతండాలుగా తిరుమలకు చేరుకున్నారు. దీంతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని క్యూలైన్లు, రోడ్లు పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. రద్దీ అనూహ్యంగా పెరగడంతో శ్రీవారి సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ప్రకటించారు. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నుండి ఎలాంటి సిఫార్సు లేఖలు తీసుకోమని టీటీడీ ప్రకటించింది. దీంతో సామాన్య భక్తులతో వస్తున్న వాహనాలు అలిపిరి టోల్ ప్లాజా నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాల రద్దీ కూడా పెరుగోతోంది.

దర్శనానికి 30 గంటల సమయం..

బుధవారం మధ్యాహ్నం భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో టీటీడీ అధికారులు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8 గంటల వరకు సర్వదర్శనం క్యూలైన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. తిరిగి రాత్రి 8 గంటలకు భక్తులను క్యూలైన్లలోకి అనుమతించారు. ఈరోజు ఉదయం నాటికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి, క్యూలైన్లు ఆక్టోపస్ భవనం వరకు బారులు తీరాయి.

క్యూ లైన్లలో భక్తుల తిప్పలు..

ప్రస్తుతం సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 30 గంటలు, టోకెన్లు ఉన్నవారికి 6 నుంచి 7 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతోంది. బుధవారం ఒక్కరోజే 86,315 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 44,107 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.94 కోట్లుగా నమోదైంది. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లలోని భక్తులకు అన్నపానీయాలు అందిస్తూ, ఎండల తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకుంటోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports