Last Updated:
తిరుమలలో టోకెన్ల రద్దు.. కానీ సామాన్య భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ఊహించిన దానికంటే భక్తుల రద్దీ తీవ్రంగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన విధానంలో భారీ మార్పులు చేసింది. ఈ వారం రోజులు శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్లాన్ చేసుకున్న భక్తులు ఈ తాజా నిబంధనలు తప్పక తెలుసుకోవాలి.














