Last Updated:
తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. భక్తుల కోలాహలంతో కలియుగ వైకుంఠం కిటకిటలాడుతోంది. శ్రీవారి దివ్యదర్శనం కోసం పరితపించే భక్తులకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. భక్తుల రద్దీ నియంత్రణ, ఇతర ప్రత్యేక ఏర్పాట్ల నిమిత్తం తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద జారీ చేసే ఎస్ఎస్డీ టోకెన్లను బుధవారం ఒక్కరోజు రద్దు చేశారు.














