Last Updated:
బ్రహ్మోత్సవాలకు తిరుపతి వెళ్తున్నారా? రైల్వే స్టేషన్లో ఈ కొత్త మార్గం చూశారా?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. అశేష సంఖ్యలో విచ్చేసే భక్తజన సంద్రంతో పుణ్యక్షేత్రం కిటకిటలాడనుంది. దేశం నలుమూలల నుంచి స్వామివారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఎన్నాళ్లుగానో పునర్నిర్మాణ పనులతో ఇబ్బందులు పడుతున్న తిరుపతి రైల్వే స్టేషన్లో ఓ శుభవార్త చెప్పారు. బ్రహ్మోత్సవాల రద్దీని తట్టుకునేలా, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేస్తూ రైల్వే స్టేషన్ దక్షిణ మార్గ ప్రవేశాన్ని (సౌత్ ఎంట్రన్స్) అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.














