Tirumala Temple: శ్రీవారి సన్నిధిలో తమిళనాడు ఎంపీ అన్బుమణి రామదాస్! కావేరి నీటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు! | | ACTPnews

News18


Last Updated:

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు పామక అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రామదాస్.. రాష్ట్ర రాజకీయాలు, రైతుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కావేరి జలాల వివాదం, రైతుల రుణమాఫీ, ప్రభుత్వ పరిపాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

+

News18

తిరుమల శ్రీవారిని తమిళనాడు పాట్టాళి మక్కల్ కచ్చి (పామక) అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రామదాస్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తమిళనాడు రాజకీయాలు, ప్రభుత్వ పరిపాలన, రైతుల సమస్యలపై మాట్లాడారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వానికి పరిపాలనపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు 100 రోజులు సరిపోవని, కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం అవసరమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అవినీతి తగ్గడం స్వాగతించదగిన పరిణామమని, అయితే పరిపాలనలో అనుభవం లేని పాలకులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports