Last Updated:
తిరుమలలో వాహనాల రద్దీ పెరిగి పార్కింగ్ సమస్య తీవ్రమైంది. టీటీడీకి ట్రాఫిక్ నిర్వహణ సవాలుగా మారింది. పర్యావరణం, భద్రతపై ఆందోళనలు.
కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల కొండపై ఇప్పుడు మరో రద్దీ భక్తులకు ఇబ్బందిగా మారుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే వాహనాల సంఖ్య భారీగా పెరగడంతో కొండపై పార్కింగ్ స్థలం దొరకడం కష్టంగా మారుతోంది. సాధారణ రోజుల్లోనే వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుండగా.. వారాంతాలు, సెలవు రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారుతోంది. దీంతో తిరుమలలో భక్తుల రాకపోకలతో పాటు వాహనాల నిర్వహణ కూడా టీటీడీకి సవాలుగా మారింది.














