Last Updated:
Tirupati: ఉన్నత భవిష్యత్తును వెతుక్కుంటూ, కంటికి రెప్పలా చూసుకున్న కన్నవారి కలలను నిజం చేసేందుకు పరాయి దేశం వెళ్లిన ఒక తెలుగు యువకుడి ప్రాణాలు అక్కడి రోడ్డు ప్రమాదంలో అనంతవాయువుల్లో కలిసిపోయాయి.
అమెరికాలో ఉద్యోగం సాధించి స్థిరపడుతున్నాడనే సంతోషం ఆ కుటుంబంలో ఐదు నెలలు కూడా నిలవలేదు. ఫ్లొరిడా నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లాకు చెందిన యంగ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ బి. దిలీప్‌కుమార్ (30) దుర్మరణం చెందారు. ఈ విషాద వార్త తెలియడంతో ఆయన స్వగ్రామంలో శోకసంద్రం అలుముకుంది. ఈనాడు కథనం ప్రకారం.. తిరుపతి జిల్లా చిల్లేపల్లి మండలం జిట్టేవారిపల్లె గ్రామానికి చెందిన బి. శ్రీహరి, చాముండి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి పెద్ద కుమారుడు దిలీప్‌కుమార్ ఎంతో కష్టపడి చదువుకుని, ఐటీ రంగంలో నిలదొక్కుకున్నాడు. మెరుగైన ఉపాధి, ఉన్నత అవకాశాల నిమిత్తం కేవలం ఐదు నెలల కిందటే అతను అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఫ్లొరిడా రాష్ట్రంలో ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరి విధులు నిర్వర్తిస్తున్నాడు.














