Tirupati News: తిరుపతిలో హైఅలర్ట్.. మరోసారి కలకలం, పరుగులు పెట్టిన భక్తులు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరుపతిలో మరోసారి కలకలం చేలరేగింది. ప్రశాంతంగా ఉంటే పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

+

News18

నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే పుణ్యక్షేత్రం తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ప్రశాంతంగా ఉన్న ఆధ్యాత్మిక నగరంలో ఒక్కసారిగా ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పర్యాటకులను, స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. నగర నడిబొడ్డున ఉన్న ప్రముఖ రాజ్‌పార్క్ హోటల్‌కు శుక్రవారం ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా ఫోన్ చేసి హోటల్‌లో బాంబు పెట్టినట్లు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.

బాంబు పెట్టామన్న వార్త క్షణాల్లో వ్యాపించడంతో హోటల్‌లో బస చేసిన అతిథులు, పనిచేస్తున్న సిబ్బంది ప్రాణభయంతో వణికిపోయారు. ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని తీవ్ర ఆందోళన చెందారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీయడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అలిపిరి ఇన్‌చార్జి సీఐ రామకృష్ణ నేతృత్వంలో భారీ పోలీసు బలగాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షణాల వ్యవధిలో హోటల్ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని..

పరిస్థితి తీవ్రతను అంచనా వేసిన పోలీసులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించారు. హోటల్ గదులు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, సమావేశ మందిరాలు, వంటశాల, ప్రవేశ ద్వారాలను అణువణువూ క్షుణ్ణంగా జల్లెడ పట్టారు. అత్యాధునిక పరికరాలతో అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయేమోనని గంటల తరబడి శ్రమించి వెతికారు. దాదాపు హోటల్ మొత్తం పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన అనంతరం అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో అదొక ఫేక్ కాల్‌గా తేలడంతో పోలీసులు, యాజమాన్యం, అతిథులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: Union Bank RSETI: 18 ఏళ్లు దాటిన వారికి బ్యాంక్ బంగారం లాంటి ఛాన్స్.. మీ తలరాత మారాల్సిందే!

కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే దురుద్దేశంతోనే ఆకతాయిలు ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇంటర్నెట్ కాల్ ద్వారా ఈ బెదిరింపు వచ్చిన నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసుల సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు.

ఇటీవల కాలంలో తిరుపతి నగరంలో తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపులు వస్తుండటం పట్ల భద్రతా విభాగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే ప్రాంతం కావడంతో పోలీసులు ప్రతి చిన్న సమాచారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ చేసి పోలీసుల సమయాన్ని వృథా చేసే ఆకతాయిలపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports