Tollywood: 50 నేరస్థుడి కథతో సినిమా.. ‘దందా’ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ కాన్సెప్ట్ మాములుగా లేదుగా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వర్టికల్ స్టోరీస్‌లో సంచలనం సృష్టించిన ‘దందా’ సిరీస్‌తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య దేవులపల్లి తన సినీ ప్రయాణం, దర్శకత్వంపై ఉన్న ఆలోచనలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

News18
News18

వర్టికల్ స్టోరీస్‌లో సంచలనం సృష్టించిన ‘దందా’ సిరీస్‌తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య దేవులపల్లి తన సినీ ప్రయాణం, దర్శకత్వంపై ఉన్న ఆలోచనలు, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చిన్నప్పటి నుంచే సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో ఇంజినీరింగ్ మధ్యలోనే వదిలేసి, ఫోటోగ్రఫీ నేర్చుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పారు. జర్నలిజంలో పనిచేసిన సమయంలో ఏర్పడిన పరిచయాల ద్వారా చాయ్ బిస్కెట్ వ్యవస్థాపకుడు అనురాగ్‌కు కథ వినిపించగా, ఆ తర్వాత చాయ్ షాట్స్‌లో క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా అవకాశం వచ్చిందన్నారు. తన లక్ష్యం 28 ఏళ్లకే దర్శకుడు కావడం అని, ఆ కలను నిజం చేసుకున్నానని తెలిపారు.

‘దందా’ కథను విజయ్ కుమార్ రాసినా.. దాన్ని పూర్తిగా రీ-రైట్ చేసి మరింత బలంగా తీర్చిదిద్దానని ఆదిత్య చెప్పారు. ప్రధాన పాత్రల బ్యాక్‌స్టోరీతో పాటు కథలో దాదాపు 40 శాతం మార్పులు చేశానన్నారు. వర్టికల్ ఫార్మాట్‌లో ప్రతి సీన్ ప్రేక్షకుడిని కట్టిపడేయాలని, అందుకే సినిమాల కంటే మైక్రో డ్రామాలు తెరకెక్కించడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు. “ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో 80 శాతం మంది మైక్రో డ్రామా చేయాలని ప్రయత్నిస్తే ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ఒక్క సెకన్ కూడా వృథా చేసే అవకాశం ఉండదు” అని ఆయన అభిప్రాయపడ్డారు.

‘దందా’కు ఇప్పటివరకు ఒక్క నెగెటివ్ రివ్యూ కూడా రాలేదని, సెలబ్రిటీల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని ఆదిత్య వెల్లడించారు. ముఖ్యంగా మేకింగ్, పేసింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డైలాగ్స్‌పై ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పారు. దొరసాయి తేజ, నితిన్ ప్రసన్న వంటి నటులు తనపై పూర్తి నమ్మకం ఉంచి పనిచేశారని, తేజ నటనలోని అసలు సామర్థ్యం ఇంకా ప్రేక్షకులు పూర్తిగా చూడలేదని పేర్కొన్నారు. సంగీత దర్శకుడు రిషి ఎమ్, సినిమాటోగ్రాఫర్ అశ్విన్ లెనిన్ తన విజన్‌ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించారని ప్రశంసించారు.

సైబర్ క్రైమ్ నేపథ్యంలో రూపొందిన ‘దందా’ను పూర్తిగా వినోదం కోసం తెరకెక్కించినప్పటికీ, సమాజానికి ఉపయోగపడే అవగాహన కూడా అందించాలనే ఉద్దేశంతో కథను రూపొందించానని ఆదిత్య తెలిపారు. సైబర్ నేరాల వెనుక ఉన్న వాస్తవాలను ప్రేక్షకులకు తెలియజేయాలనేదే లక్ష్యమని చెప్పారు. భవిష్యత్‌లో దొరసాయి తేజతో కలిసి ‘దందా’ కంటే మరింత వైల్డ్‌గా ఉండే ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం 50 ఏళ్ల నేరస్థుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ పవర్‌ఫుల్ కథను సిద్ధం చేస్తున్నానని, దానికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు మూడు నెలల్లో వచ్చే అవకాశం ఉందని చెప్పారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports