తమిళ సినిమాలతో 90ల్లో పాపులర్ అయింది వినీత (Vineetha). ఆమె అసలు పేరు లక్ష్మి. ఇండస్ట్రీలోకి వచ్చేముందు తన పేరును వినీతగా మార్చుకుంది. 1993లో శరత్ కుమార్‌తో ‘కట్టబొమ్మన్’ అనే సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అరుణ్ పాండియన్ హీరోగా వచ్చిన ‘ఊజియన్’తో హిట్టు కొట్టింది. దీంతో ఆమె యాక్టింగ్, అందానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత వినీత వెంకటేష్, రాజేంద్రప్రసాద్, మోహన్ లాల్, శరత్ కుమార్, రాంకీ, విజయ్‌కాంత్, కార్తీక్, జయరాం, తదితర నటులతో కలిసి నటించింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే ముందు వినీత మిస్ ఇండియా కాంపిటిషన్లో పార్టిసిపేట్ చేసింది.













