Top10 News: ప్రధాని మోదీ రికార్డ్.. భారతీ రాజా కన్నుమూత.. ఈ రోజు టాప్10 న్యూస్ | | ACTPnews

Top10 News: ప్రధాని మోదీ రికార్డ్.. భారతీ రాజా కన్నుమూత.. ఈ రోజు టాప్10 న్యూస్ |


మంత్రి నారా లోకేశ్ విశాఖ ఉక్కు పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనీ, దాన్ని రెండుసార్లు కాపాడిన చరిత్ర తమదేనని తెలిపారు. వైఎస్ జగన్ ఉక్కు పరిశ్రమను నాశనం చేసి భూములు తీసుకోవాలని ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ లేకుండా చేసే కుట్రలు చేసిన వారు.. కార్మికులకు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు.

2. ఆమెపై తెలంగాణలో కేసులు లేవు:

మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఇది బీజేపీ కుట్రగా, ప్రజాస్వామ్యంపై దాడిగా ఆయన విమర్శించారు. అవసరమైన అఫిడవిట్ సమాచారం ఇవ్వలేదని చెబుతూ రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించారు. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు.. ఎన్నికల సంఘాన్ని కలవడానికి యత్నించగా అడ్డంకులు ఎదురయ్యాయని, న్యాయపోరాటం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

3. అది నిరూపిస్తే రాజీనామా చేస్తా:

తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడ్డానని నిరూపిస్తే రాజీనామా చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. సీనియర్ జర్నలిస్టులతో కమిటీ వేసి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి మంత్రినీ కలిసినప్పుడు తెలంగాణ ప్రాజెక్టులపై మాట్లాడుతున్నాననీ, తాను ఎలాంటి అడ్డంకులు కలిగించలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఆరోపణలు రాజకీయ కుట్రతో చేస్తున్నవని విమర్శించారు.

4. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు ఉండదా?

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో, రాబోయే అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఇతర పార్టీలతో పొత్తులు ఉండవనీ, సొంత బలంతో అధికారంలోకి రావడమే లక్ష్యమని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని ఢిల్లీ నాయకత్వం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుందని సమాచారం.

5. ప్రధాని మోదీ రికార్డ్:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో మరో చారిత్రక మైలురాయిని సాధించి, జవహర్‌లాల్ నెహ్రూ సుదీర్ఘ నిరంతర ప్రధానిగా ఉన్న రికార్డును అధిగమించారు. ఆయన ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తిచేసుకుని 4,399 రోజుల పదవీకాలాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్రజా సేవే సుపరిపాలనకు అసలైన ప్రమాణమని ‘ఎక్స్’లో తెలిపారు.

6. మోదీ ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు:

ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం ప్రధానిగా రికార్డు సాధించంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్ర విమర్శలు చేశారు. మోదీ దేశానికి పెద్ద సమస్యగా మారారనీ, ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్నారని అన్నారు. మోదీ పాలనకు కాకుండా దేశంలో నెహ్రూ నేతృత్వంలో భారత తొలి ప్రభుత్వం సాధించిన చారిత్రక విజయాల్ని గుర్తుచేసి, ఆ వారసత్వాన్ని మోదీ చెరిపివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

7. భారతీ రాజా కన్నుమూత

దిగ్గజ దర్శకుడు భారతీ రాజా ఈ రోజు ఉదయం అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ప్రకటించారు. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలో భారతీరాజా పార్థివ దేహానికి సీఎం విజయ్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం విజయ్, అలీ, ముచ్చెర్ల అరుణ తదితర ప్రముఖులు ఆయన నివాసంలో భారతీరాజాకి నివాళులు అర్పించారు.

8. వయసు నంబర్‌ మాత్రమే

అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 25 ఏళ్ల వేడుక ప్రారంభానికి హాజరయ్యారు. వయసు కేవలం సంఖ్య మాత్రమేననీ, నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమని ఆయన అన్నారు. ఈ ఆసుపత్రిని చాలామంది దేవాలయంలా భావిస్తారనీ, అనేక మంది ఇక్కడ చికిత్సతో కోలుకున్నారని తెలిపారు. తన పుట్టినరోజును కూడా చిన్నారులతో కలిసి జరుపుకుని వారికి కేక్ పంచి బహుమతులు అందించారు.

9. పెద్ది.. ఆరు రోజుల్లోనే అరుదైన రికార్డు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధిస్తోంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.332.1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. జూన్ 4న విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌తో దూసుకుపోతోంది. రామ్ చరణ్ నటన, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన బలం కాగా, జాన్వీ కపూర్, జగపతిబాబు తదితరుల నటన కూడా ఆకట్టుకుంది.

10. ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు

హర్మూజ్‌ సమీపంలో అమెరికాకు చెందిన ఏహెచ్‌-64 అపాచీ హెలికాప్టర్‌ కూలిపోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఘటనకు ఇరాన్‌ డ్రోన్‌ దాడే కారణమని అమెరికా ఆరోపించింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరికల తర్వాత అమెరికా ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఖెష్మ్‌ దీవి ప్రాంతంలో పేలుళ్లు జరిగినట్టు ఇరాన్‌ మీడియా తెలిపింది. హెలికాప్టర్‌లోని ఇద్దరు పైలట్లను అమెరికా సురక్షితంగా రక్షించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports