Last Updated:
తిరుమల భక్తులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. రేపే ఆ సరికొత్త సదుపాయాల ప్రారంభం!
కలియుగ వైకుంఠం తిరుమలగిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం అత్యంత శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న ఈ మహా క్రతువుకు సన్నాహకంగా అంకురార్పణ ఘట్టాన్ని వేదపండితులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీవారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో కన్నుల పండువగా ఊరేగింపుగా విచ్చేసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి, పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు.













