Vaibhav Sooryavanshi: తొలి ప్రాక్టీస్ సెషన్‌లో వైభవ్ సూర్యవంశీకి చేదు అనుభవం.. టీమిండియా అసంతృప్తి | క్రీడా వార్తలు | ACTPnews

వైభవ్ సూర్యవంశీ


Last Updated:

Vaibhav Sooryavanshi: ఐర్లాండ్‌తో శుక్రవారం జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టు సన్నాహాలు అంత సజావుగా సాగలేదు.

వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ

బెల్ఫాస్ట్‌ చేరుకున్న భారత ఆటగాళ్లకు ఇక్కడి ప్రాక్టీస్ స్టేడియంలో సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి కేటాయించిన ఒక పిచ్‌ వెనుక ‘సైట్‌స్క్రీన్’ లేకపోవడాన్ని మేనేజ్‌మెంట్ గుర్తించింది. బౌలర్ చేతి నుంచి వచ్చే బంతి బ్యాటర్‌కు స్పష్టంగా కనిపించాలంటే సైట్‌స్క్రీన్ తప్పనిసరి. అది లేకపోవడంతో ఇషాన్ కిషన్ వంటి సీనియర్ బ్యాటర్లతో పాటు ఇతర ఆటగాళ్లు కూడా బంతిని సరిగ్గా అంచనా వేయడానికి ఇబ్బంది పడ్డారు.

దీనిపై భారత జట్టు ఆపరేషన్స్ మేనేజర్ వెంటనే స్పందించి, క్రికెట్ ఐర్లాండ్ అధికారులతో మాట్లాడి నిరసన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన స్థానిక నిర్వాహకులు ప్రాక్టీస్ సెషన్ వేగం పుంజుకోకముందే ఆ లోపాన్ని సరిదిద్దారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి ఇది టీమిండియాతో తొలి ట్రైనింగ్ సెషన్ కాగా.. సైట్ స్క్రీన్ కారణంగా అతడికి ఒక చేదు అనుభవంగా మారింది.

తొలి సెషన్‌లో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ

ఈ గందరగోళం సర్దుమణిగిన తర్వాత, అందరి దృష్టి 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే నిలిచింది. సీనియర్ జాతీయ జట్టుతో తన కెరీర్‌లో మొట్టమొదటి నెట్ సెషన్‌లో పాల్గొన్న వైభవ్, తనపై ఉన్న భారీ అంచనాల ఒత్తిడిని ఏమాత్రం దరిచేరనివ్వలేదు. ఎడమచేతి వాటం కలిగిన ఈ కుర్రాడు నెట్స్‌లో అత్యంత ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తూ, మైదానం నలుమూలలా క్లాసిక్ డ్రైవ్‌లు, తన మార్క్ అటాకింగ్ షాట్లతో అలరించాడు. పిచ్‌పై బౌన్స్ హెచ్చుతగ్గులుగా ఉన్నప్పటికీ సూర్యవంశీ సులువుగా సిక్సర్లు బాదడం విశేషం.

భారత అభిమానుల సందడి

సాధారణంగా క్రికెట్ హడావుడి పెద్దగా లేని బెల్ఫాస్ట్ నగరంలో వైభవ్ రాకతో ఒక్కసారిగా సందడి నెలకొంది. భారత సంతతికి చెందిన ప్రవాస భారతీయులు (NRIs) పెద్ద సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. నెట్స్ ముగిసిన తర్వాత వైభవ్‌తో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడ్డారు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ వైభవ్‌కు సంరక్షకుడిగా (Guardian) నియమించిన రోమి భిందర్‌తో పాటు, వైభవ్ తల్లిదండ్రులు కూడా ఈ పర్యటనలో జట్టుతో పాటే ఉన్నారు. సరికొత్త టీ20 శకంలో అడుగుపెడుతున్న భారత్, ఈ మ్యాచ్‌లో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం ఇచ్చి చరిత్ర సృష్టిస్తుందా.. లేదా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వంటి సీనియర్లతోనే బరిలోకి దిగుతుందా అనేది కొన్ని గంటల్లో తేలనుంది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed