వందే భారత్ స్లీపర్ రైళ్లలో మరో గొప్ప విషయం ఉంది. ఈ రైళ్లలో అచ్చం విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతిని కలిగిస్తున్నారు. లోపలి ఫెసిలిటీస్ అన్నీ హై రేంజ్‌లో ఉంటాయి. ఎటుచూసినా కుషన్లు, మోడ్రన్ ఎమెనిటీస్ కల్పించారు. కళ్లు చెదిరే డిజైన్ ఉంది. మరోలా చెప్పాలంటే.. ఈ రైళ్ల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైల్వే, డిజైన్ తయారీ సంస్థ BEML, ఈ రైళ్లలో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ బోగీలను మోడ్రన్ స్టాండర్డ్స్‌తో రూపొందించాయి. ప్రతీ కోచ్‌లో ప్రయాణికులను ఆకట్టుకునేలా లేటెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్, పై బెర్త్‌ని ఈజీగా ఎక్కేందుకు వీలుగా అనువైన మెట్లు కూడా సెట్ చేసింది.














