Varudu Kalyani | భక్తుల మనోభావాలు దెబ్బతీశారు.. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్.. | ACTPnews

Varudu Kalyani  | భక్తుల మనోభావాలు దెబ్బతీశారు..  ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్..



విశాఖపట్నంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. భగవద్గీత వంటి పవిత్ర గ్రంథంపై ఆయన అహంకారంతో మాట్లాడటం సరికాదని, ఇది భక్తుల మనోభావాలను కించపరచడమేనని ఆమె అన్నారు. గతంలో ఆయనకు సంబంధించి కొన్ని అసభ్యకర వీడియోలు బయటకు వచ్చాయని, అటువంటి వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు ప్రభుత్వం మంటగలుపుతోందని ఆమె ఆరోపించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *