Varun Tej: కొరియన్ కనకరాజు సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసా?.. మరీ అంత తక్కువనా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. టీజర్, ట్రైలర్‌లు గట్రా ఇప్పటికే సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మధ్య మనం చాలా కాలంగా మిస్ అవుతున్నా హార్రర్ కామెడీ జానర్‌లో ఈ మూవీ రానుండంతో పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి.

News18
News18

మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమాపై మెల్లి మెల్లిగా అంచనాలు ఎగబాకుతున్నాయి. టీజర్, ట్రైలర్‌లు గట్రా ఇప్పటికే సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ మధ్య మనం చాలా కాలంగా మిస్ అవుతున్నా హార్రర్ కామెడీ జానర్‌లో ఈ మూవీ రానుండంతో పీక్స్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. గత కొన్ని ఏళ్లుగా వరుణ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరమైన డిజాస్టర్‌లుగా నిలుస్తాయి. ఆ ఫ్లాపుల పరంపరకు కొరియన్ కనకరాజు మూవీ బ్రేక్ వేసేలానే కనిపిస్తుంది…

మరోవైపు దర్శకుడిపై కూడా జనాల్లో మంచి క్రేజ్ ఉంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్దం, మ్యాస్ట్రో వంటి సినిమాలు తెరకెక్కించిన మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఒక కొరియన్ గ్యాంగ్ స్టర్ దెయ్యం.. సంబంధమే లేని అనంతపురం జిల్లాలో ఉండే కుర్రాడి ఒంట్లోకి ఎందుకు ప్రవేశించింది అనే లైన్‌తో ఈ సినిమాను గాంధీ తెరకెక్కించాడు. కొరియన్ కనకరాజు టైటిల్ మాస్‌గా ఉన్నా.. కంటెంట్ మాత్రం చాలా క్లాస్‌గా ఉంటుందట. ఈ సబ్జెక్ట్‌తో జనాలను ఎలా ఎంటర్‌టైన్ చేస్తాడో చూడాలి.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు చాలా తక్కువ బిజినెస్ జరిగింది. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమాకు రూ.12.50 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.13.50 కోట్ల వరకు కొల్లగొట్టాల్సి వస్తుంది. వరుణ్ తేజ్ కెరీర్‌లో రీసెంట్ మూవీస్‌లో లోయెస్ట్ బిజినెస్ ఇదే. నిజానికి ఈ మధ్య వరుణ్‌కు కూడా హిట్లు లేవు. తొలిప్రేమ తర్వాత సోలోగా ఒక్క కమర్షియల్ హిట్టు కొట్టలేదు. దాంతో సేఫ్ టార్గెట్‌తో రంగంలోకి దిగుతున్నాడు.

ప్రస్తుతం సినిమాకున్న బజ్‌కు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా సరే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా అయిపోతుంది. ఈ సినిమాలో ‘మిరాయ్’ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్‌గా నటించింది. కీలక రోల్‌లో కమెడియన్ సత్య నటిస్తున్నాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైమెంట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నిజానికి ఈ సినిమాకు రూ.38 కోట్ల వరకు బడ్జెట్ అయింది. కాగా.. ఆల్రెడీ నాన్ థియేట్రికల్ రూపంలోనే రూ.26 కోట్లు వచ్చేశాయి. మిగిలిన రూ.12 కోట్లు థియేట్రికల్ బిజినెస్ అయింది. ఈ లెక్కన ప్రొడ్యూసర్లు రిలీజ్‌కు ముందే సేఫ్ సైడ్‌కు వెళ్లిపోయారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆగస్టు 7న రిలీజ్ కాబోతుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed