Veerabhadrudu Movie: రూ.200 కోట్ల సింహాసనంపై ‘వీరభద్రుడు’ మూవీ.. బాక్సాఫీస్‌పై సూర్య ఊచకోత..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్‌పై సూర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ‘వీరభద్రుడు’ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. నిజానికి ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలేం రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది.

News18
News18

చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్‌పై సూర్య విధ్వంసం సృష్టిస్తున్నాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ‘వీరభద్రుడు’ సినిమాతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. నిజానికి ఈ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలేం రాలేదు కానీ.. డీసెంట్ హిట్ అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. అయితే పోటీగా సినిమాలు లేకపోవడం.. ఉన్న సినిమాలు కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయలేకపోవడం, పైగా వేసవి సెలవులు కావడంతో ‘వీరభద్రుడు’ సినిమాకు బాగా కలిసొచ్చింది. అవే ఇప్పుడు నిర్మాతల పాలిట కనక వర్షం కురిపిస్తున్నాయి.

ఈ సినిమాకు తమిళ్ కమెడియన్ ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహించాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు 9 రోజులు ముందు భారీ అంచనాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. డే1 నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మాములు ఆడియెన్స్ వన్ టైమ్ వాచ్ అని రివ్యూలు ఇచ్చినా.. ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ మీల్స్‌లా అనిపించింది.

ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్ల మార్క్‌ను దాటేసింది. తొమ్మిది రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.217 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఒక్క ఓవర్సీస్‌లోనే రూ.68 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.70 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన షేర్ రూ.104 కోట్లు. అంటే ఈ సినిమాకు ఆల్రెడీ రూ.33 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.

దత్త పుత్రుడు అంటూ సూర్యను ముద్దుగా పిలిచుకునే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా సాలిడ్ కలెక్షన్లు రాబడుతుంది. దాదాపు రూ.7.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమా 9 రోజులు పూర్తయ్యే సరికి రూ. 11 కోట్ల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది. ప్రస్తుతం

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో దొంగతనం జరిగిన తన నగలను రికవరీ చేసుకోవడానికి ఒక నిరుపేద తండ్రి పడే ఆరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అవినీతిమయమైన న్యాయ వ్యవస్థ, స్వార్థపరుడైన లాయర్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) వల్ల ఆ తండ్రికి అన్యాయం జరుగుతుంది. ఈ క్రమంలో నాంపల్లి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు (సూర్య) స్వయంగా భూమిపైకి వచ్చి బాధితుడి తరపున ఎలా పోరాడారు? కోర్టులో దేవుడు చేసిన వాదనలేంటి? అన్నదే ఈ సినిమా కథ…

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports