Ponguleti Cabinet Decisions | ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. సర్కార్ సంచలన నిర్ణయం! | ACTPnews

Ponguleti Cabinet Decisions | ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్.. సర్కార్ సంచలన నిర్ణయం!



రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక నిర్ణయాలను ప్రకటించారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న సుమారు రూ. 6,000 కోట్ల బకాయిలను వచ్చే 100 రోజుల్లో చెల్లించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ తమ నెలవారీ జీతాల్లో 50 శాతం కోత విధించుకుని, ఆ మొత్తాన్ని బకాయిల చెల్లింపుల కోసం జమ చేయాలని నిర్ణయించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెలకు రూ. 750 కోట్ల చొప్పున చెల్లిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. వీటితో పాటు, ప్రాథమిక కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఛైర్మన్ల నియామకం నామినేటెడ్ పద్ధతిలో చేపట్టాలని, గచ్చిబౌలి స్టేడియంలో 21 రకాల క్రీడలకు వీలుగా ఆధునీకరించాలని కేబినెట్ తీర్మానించినట్లు వెల్లడించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed