జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు వీణ శనివారం ఒక కొత్త వీడియోను విడుదల చేశారు. “అరవ శ్రీధర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ గారు వేసిన త్రిసభ్య కమిటీ ఏమైంది? ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా లేదా?” అని ఆమె ప్రశ్నించారు. కమిటీ నివేదిక రాకముందే, చర్యలు తీసుకోకముందే అరవ శ్రీధర్ పార్టీ కండువా కప్పుకుని బహిరంగ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారని ఆమె నిలదీశారు. పవన్ కళ్యాణ్ ఆయనకు ఇంటర్నల్‌గా క్లీన్ చిట్ ఇచ్చారా అని అనుమానం వ్యక్తం చేసిన వీణ, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపనని స్పష్టం చేశారు. బాధ్యుడైన వ్యక్తి యధేచ్ఛగా తిరుగుతుంటే తనకు న్యాయం ఎలా జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
Source link
Victim Veena Questions Pawan Kalyan | పవన్… కమిటీ ఏమైంది? వీణ సంచలన వీడియో | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










