Vijay deverakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక విజయ్ దేవరకొండ దంపతులు  | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 180 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ అందజేశారు.

+

News18

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 180 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ అందజేశారు. 9, 10వ తరగతిలో ప్రతిభ కనబర్చి ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ సతీమణి రష్మిక, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ….. ఈరోజు ఊరు చాలా అందంగా ఉంది. ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు కంగ్రాట్స్. మీ విజయాన్ని, దాని వెనకున్న క్రమశిక్షణను సెలబ్రేట్ చేయడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కంటే, ఆ మార్కులు సాధించేందుకు పడిన శ్రమ, ఏకాగ్రత చాలా గొప్పవి. మీరు ఫోకస్ గా, డిసిప్లిన్ గా ఉండి ప్రయత్నించడం వల్లే ర్యాంకులు సాధించగలిగారు. ఒక్కోసారి మార్కులు తక్కువ రావొచ్చు, ఎక్కువ రావొచ్చు కానీ.. జీవితంలో ఫోకస్, క్రమశిక్షణ చాలా ముఖ్యం. అవి ఉంటే ఏ రంగంలో అయినా గొప్ప స్థాయికి వెళ్లొచ్చు అని ఆయన అన్నారు.

స్టూడెంట్ లైఫ్ లో నేనెప్పుడూ ఫస్ట్ ర్యాంకర్ కాదు, రష్మిక అసలే కాదు. మీ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి మేమంతా ఇక్కడికి వచ్చాం. ఈసారి రిజల్ట్స్ లో తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా సెకండ్ ప్లేస్ లో నిలిచినందుకు హ్యాపీగా ఉంది. నాగర్ కర్నూలు టీచర్స్ అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. పిల్లల జీవితాల్లో టీచర్స్, తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. పేరెంట్స్ ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలా నేర్చుకుంటారు. మీరు గొప్ప వ్యాల్యూస్ నేర్పిస్తే వాళ్లు గొప్పగా ఎదుగుతారు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే పుట్టపర్తి స్కూల్లోని మంచి వాతావరణం. మా ఇంట్లో పేరెంట్స్ నేర్పించిన మంచి నడవడికే కారణం. మా నాన్న అమ్మ ఈ ఊరితో పెంచుకున్న అనుబంధం వల్లే నేను ఈ రోజు ఈ ఛారిటీ కార్యక్రమం చేయగలుగుతున్నా.

మీ అందరి జీవితాల్లో నేనూ ఒక ముఖ్య భాగం కావాలనే ఈ స్కాలర్ షిప్స్ ఇస్తున్నాం. ఇప్పుడు అచ్చంపేటలో స్టార్ట్ చేశాం, నెక్ట్స్ నాగర్ కర్నూల్ లో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్స్ అందించాలనేదే నా డ్రీమ్. ఈ కార్యక్రమం చూసి నెక్ట్స్ ఇయర్ కూడా పిల్లలు విజయ్ అన్న వస్తాడు, స్కాలర్ షిప్స్ ఇస్తాడు అనే ఉత్సాహం కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఛారిటీ కార్యక్రమం నిజమైన అర్హులకు మాత్రమే వెళ్లేలా చూడాలని నేను విద్యాశాఖ అధికారులను, టీచర్స్ ను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్.. ఇక్కడేమీ కల్తీ చేయకండి. ఇది మిస్ యూజ్ అయితే నా హార్ట్ బ్రేక్ అవుతుంది. ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది. విద్యార్థులందరికీ గుడ్ లక్. బాగా చదువుకోండి అని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *