Vinayakan: జైలర్ 2 నటుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు.. ఫేస్‌బుక్‌లో మైనర్ బాలిక ఫొటోతో వివాదం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మహిళలను అవమానించారన్న ఫిర్యాదు మేరకు జైలర్ 2 నటుడు వినాయకన్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఆ వివరాలు చూస్తే..

News18
News18

మహిళలను అవమానించారన్న ఫిర్యాదు మేరకు జైలర్ 2 నటుడు వినాయకన్‌పై పోలీస్ కేసు నమోదైంది. అలప్పుజ జిల్లా మావెలిక్కర పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆయన న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. మీడియా వర్గాల సమాచారం మేరకు ఓ మైనర్ బాలిక ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు చర్యలు ప్రారంభించారు.

ప్రస్తుతం ముంబైలో ఉద్యోగం చేస్తున్న తళకర వాసి ఈ ఫిర్యాదును దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఫిర్యాదు ప్రకారం, వినాయకన్ ఫిర్యాదుదారుని మైనర్ కుమార్తె ఫోటోను ఆమె అనుమతి లేకుండా ఫేస్‌బుక్‌లో షేర్ చేసినట్లు ఆరోపణలు చేస్తున్నారు. తాను గతంలో నటుడికి సంబంధించిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌ను వాట్సాప్ ద్వారా ఫార్వార్డ్ చేశానని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. దీనివల్ల వినాయకన్‌కు కోపం వచ్చిందని అతను ఆరోపించాడు. ఆ తర్వాత ఆ నటుడు, తన ఎనిమిదేళ్ల కుమార్తె ఉన్న వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్‌ను చూపిస్తూ ఒక స్క్రీన్‌షాట్‌ను ఫేస్ బుక్ లో అప్‌లోడ్ చేశాడని ఆరోపించాడు.

ఆ పోస్ట్‌లో తన ఫోన్ నంబర్‌తో పాటు అసభ్యకరమైన వ్యాఖ్యలు కూడా ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫేస్‌బుక్ పోస్ట్ కారణంగా గుర్తు తెలియని వ్యక్తుల నుండి పదేపదే ఫోన్ కాల్స్ వచ్చాయని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఆ పోస్ట్ ద్వారా తన కాంటాక్ట్ నంబర్ పొందిన తర్వాత, కాల్ చేసిన వారిలో చాలామంది తనను దూషించారని అంటున్నాడు. ఈ సంఘటన అనంతరం, బాలిక తండ్రి కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ను ఆశ్రయించి, న్యాయ సహాయం కోరారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం, తగిన చర్యలు ప్రారంభించాలని కమిషన్ మావెలిక్కర పోలీసులను ఆదేశించింది.

ర‌జినీకాంత్ న‌టించిన జైల‌ర్ సినిమాలో విల‌న్‌గా న‌టించిన ఇండియావైడ్‌గా సూప‌ర్ పాపులారిటీ తెచ్చుకున్నాడు మ‌లయాళ న‌టుడు వినాయ‌కన్ (Vinayakan)‌. ప్రస్తుతం జైలర్ 2 లో కూడా నటిస్తున్నాడు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed