Last Updated:
Women’s Asia Cup 2026: భారత్ అంటే చాలు పాకిస్తాన్‌కు ఎక్కడలేని అసూయ ఉంటుంది. క్రికెట్లో అయితే ఇది ఇంకా ఎక్కువ. భారత క్రికెట్ జట్టును అనుకరిస్తూ నవ్వుల పాలు అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆ జాబితాలో బంగ్లాదేశ్ కూడా చేరింది.
మొన్నటి వరకు పురుషుల జట్టు మాత్రమే అనుకుంటే ఇప్పుడు మహిళల జట్టు కూడా ఈ జాబితాలో చేరింది. తాజాగా ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా జరిగిన తొలి సెమీఫైనల్లో బంగ్లాదేశ్ మహిళల జట్టు చేసిన ఓవరాక్షన్ అంతా ఇంత కాదు. చివరకు టీమిండియా బలం ముందు తేలిపోయింది. భారత్ కూడా ఇచ్చిపడేసింది. మహిళల టీ20 ఆసియా కప్‌లో భారత జట్టు అదరగొట్టింది. గురువారం దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ పోరులో బంగ్లాదేశ్‌ను 40 పరుగుల తేడాతో చిత్తు చేసి ఆరోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా, ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు ఇన్నింగ్స్ (40 బంతుల్లో 64 పరుగులు) పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు సాధించింది. అనంతరం 150 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ అద్భుతమైన ప్రదర్శన కనబర్చి 4 ఓవర్లలో కేవలం 26 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో హైలైట్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.














