Last Updated:
Women’s Asia Cup 2026: ఆసియా వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. ఉత్కంఠభరితంగా సాగిన మహిళల టీ20 ఆసియా కప్ టోర్నమెంట్లో హర్మన్‌ప్రీత్ సేన విశ్వరూపం ప్రదర్శించి ఛాంపియన్‌గా అవతరించింది.
ఆదివారం జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్ పోరులో భారత్ 72 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. ఆద్యంతం ఏకపక్షంగా సాగిన ఈ సమరంలో బ్యాటింగ్‌లో ఓపెనర్లు షెఫాలి వర్మ, స్మృతి మంధాన మెరుపు అర్ధశతకాలతో కదం తొక్కగా.. బౌలింగ్‌లో తెలుగు తేజం శ్రీచరణి, సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని కుప్పకూల్చారు. ఈ ఘన విజయంతో భారత్ రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడి సరికొత్త చరిత్ర లిఖించింది.














