Last Updated:
కేజీఎఫ్ ఫేమ్ యశ్ తాజాగా చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. గతంలో నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చాడు యశ్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ (KGF) సినిమాతో ‘రాకింగ్ స్టార్’ యశ్ (Yash) పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ‘టాక్సిక్’ (Toxic) సినిమా చిత్రీకరణలో అత్యంత బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో, గతంలో తన స్టార్‌డమ్‌ను ఉద్దేశించి ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలపై యశ్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. అత్యంత పరిణితితో ఆయన ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.














