YS Sharmila | మతం మారితే రిజర్వేషన్లు పోవాలా? వైఎస్ షర్మిల ఫైర్ | ACTPnews

YS Sharmila  | మతం మారితే రిజర్వేషన్లు పోవాలా? వైఎస్ షర్మిల ఫైర్



దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం (మార్చి 31, 2026) నిరసన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆమె మాట్లాడుతూ.. మతం మారినంత మాత్రాన ఒక వ్యక్తి ఎదుర్కొనే సామాజిక వివక్ష పోదని, కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు తమ హక్కులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుట్టుకతో వచ్చిన కులం మారదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని రాజ్యాంగ సవరణ చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports