YS Sharmila | కార్యకర్తల కోసమే పథకాలా? చంద్రబాబు, జగన్‌లపై షర్మిల ఫైర్! | ACTPnews

YS Sharmila  | కార్యకర్తల కోసమే పథకాలా?  చంద్రబాబు, జగన్‌లపై షర్మిల ఫైర్!



ప్రస్తుత రాజకీయాల్లో సంక్షేమ పథకాల పంపిణీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహానేత వైఎస్సార్ పాలనలో పథకాలు పార్టీలు, కులమతాలకు అతీతంగా అందేవని.. కానీ నేడు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూరుస్తున్నారని మండిపడ్డారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అదే జరిగిందని, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా తమ కూటమి కార్యకర్తలకే పెద్దపీట వేస్తోందని ఆమె ఆరోపించారు. ప్రజలను ఓటర్లుగా కాకుండా మనుషులుగా చూడాలని, రాజకీయాల్లో మార్పు రావాలని ఆమె డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports