Last Updated:
పాకిస్తాన్, తన ప్రయోజనాలు సాధించుకుని మెల్లగా దూరమవుతోందని అమెరికాకు ఇప్పుడు అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా సెనేటర్లు కూడా పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం కాదని, అది తానే ఒక పెద్ద సమస్యగా మారిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
బురదలో రాయి వేసినా అది తిరిగి మనకే మురికి అంటుతుందని అంటారు. కానీ అమెరికా మాత్రం నేరుగా ఆ బురదలో కాలుపెట్టిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ విషయంలో ఇప్పటివరకు అమెరికా విధానం ఎక్కువగా ప్రయోజనాలకే పరిమితమై ఉండేది. అయితే డొనాల్డ్ ట్రంప్ పాలనలో పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న పాకిస్తాన్, తన ప్రయోజనాలు సాధించుకుని మెల్లగా దూరమవుతోందని అమెరికాకు ఇప్పుడు అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికా సెనేటర్లు కూడా పాకిస్తాన్ సమస్యలకు పరిష్కారం కాదని, అది తానే ఒక పెద్ద సమస్యగా మారిందని బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో పాకిస్తాన్ మరోసారి తన ద్వంద్వ వైఖరితో విమర్శలను ఎదుర్కొంటోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం చేస్తూ శాంతిదూతగా కనిపించాలనుకున్న ఇస్లామాబాద్ ఇప్పుడు అనుమానాల కేంద్రంగా మారింది. అమెరికా రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ పాకిస్తాన్ పాత్రపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం పాకిస్తాన్ వ్యవహారం కేవలం అనుమానాస్పదమే కాకుండా సమస్యాత్మకంగా కూడా మారిందన్నారు.
ప్రారంభంలో ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తతల సమయంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం, శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ట్రంప్‌ను “నా ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్” అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ప్రశంసించేలా ప్రయత్నించిందని ప్రచారం జరిగింది.
అయితే అదే సమయంలో ఇరాన్‌కు చెందిన సైనిక విమానాలు పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌లో ఆశ్రయం పొందినట్లు వచ్చిన నివేదికలు అమెరికాలో అనుమానాలకు దారితీశాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వ వర్గాలు కూడా పాకిస్తాన్ అసలు ఉద్దేశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకవైపు సౌదీ అరేబియాతో సంబంధాలు కొనసాగిస్తూనే, మరోవైపు ఇరాన్‌కు మద్దతుగా కనిపించడం పాకిస్తాన్ ద్వంద్వ వైఖరికి ఉదాహరణగా చూపుతున్నారు.
ఇటీవల ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్ దేశాలను అబ్రహాం ఒప్పందాల్లో చేరాలని కోరారు. అయితే పాకిస్తాన్ మాత్రం ఇజ్రాయెల్‌ను గుర్తించాలంటే 1967 సరిహద్దుల ఆధారంగా స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడి, తూర్పు జెరూసలేం దాని రాజధానిగా ఉండాలని స్పష్టం చేసింది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయగా, సెనేటర్ లిండ్సే గ్రాహమ్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఒకవైపు అమెరికా సహాయం, ఐఎంఎఫ్ ప్యాకేజీలు కోరుతూనే, మరోవైపు అమెరికా వ్యూహాత్మక లక్ష్యాలకు సహకరించడంలో వెనుకడుగు వేస్తోందని విమర్శలు వస్తున్నాయి. గాజా స్థిరీకరణ దళంలో చేరకపోవడం, ఇరాన్‌కు పరోక్ష మద్దతు ఇవ్వడం, అబ్రహాం ఒప్పందాలను తిరస్కరించడం వంటి అంశాలు ట్రంప్ అంచనాలకు విరుద్ధంగా మారినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, అమెరికా మళ్లీ భారత్ వైపు మొగ్గుచూపుతున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ట్రంప్ తరచూ భారత్‌కు అనుకూల వ్యాఖ్యలు చేయడం, అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారుల భారత పర్యటనలు పెరగడం, ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల కోసం ప్రయత్నాలు జరుగుతుండటం దీనికి సంకేతాలుగా పేర్కొంటున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 27, 2026 10:12 AM IST













