టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగం.. విడుదలకు సిద్ధంగా తొలి ఏఐ ఫీచర్ ఫిల్మ్‌ ‘అంబ’s రివెంజ్’ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మార్కెట్ రూపు మారుతోంది. AI విప్లవం దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ ‘అంబ’s రివెంజ్’ చిత్రం ముస్తాబవుతోంది.

News18
News18

మార్కెట్ రూపు మారుతోంది. AI విప్లవం దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ ‘అంబ’s రివెంజ్’ చిత్రం ముస్తాబవుతోంది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఐ విజువల్ డిజైన్ & డెవలప్‌మెంట్‌ను ‘కాలై విజువల్ స్టూడియోస్’ అందిస్తోంది. పూర్తి స్థాయి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

భారత ఇతిహాసమైన మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత యోగేంద్ర పొట్లూరి, దర్శకుడు జయవర్ధన్ మడి మాట్లాడుతూ, తెలుగు సినిమాకు ఇది ఒక కొత్త ప్రయోగాత్మక అధ్యాయానికి నాంది అని తెలిపారు. చిత్ర నిర్మాణంలోని పలు దశల్లో ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నామని, ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగించడం ద్వారా వినూత్న కథనాన్ని ఆవిష్కరిస్తున్నామని చెప్పారు.

టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. పురాణ ఇతివృత్తాన్ని అత్యాధునిక కృత్రిమ మేధ సాంకేతికతతో మేళవిస్తూ రూపొందుతున్న ‘అంబ’s రివెంజ్’ ఇప్పటికే సినీ అభిమానులు, పరిశ్రమ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏఐ ఆధారిత కథా నిర్మాణానికి నాంది పలికే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆసక్తిని కలిగిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports