పల్లె నేపథ్యంతో ‘ప్రేమనే ఊరిలో’.. సెప్టెంబర్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. సెప్టెంబర్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.

News18
News18

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. అలాగే తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ పొందాయి. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలకు సిద్ధమైంది.

KGF, కాంతారా వంటి చిత్రాలకు డైలాగ్స్ అందించిన హనుమాన్ చౌదరి ఈ చిత్రానికి సంభాషణలు రాశారు. ప్రముఖ గేయ రచయిత రాంబాబు గోసాల పాటలను రచించారు. సునద్ గౌతమ్ సంగీతం అందిస్తుండగా, రాజ్‌కాంత్ ఎస్.కె సినిమాటోగ్రఫీ, హర్షిత్ ప్రభు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, ప్రేమ, భావోద్వేగాలు, బలమైన పాత్రలు, అందమైన పల్లె నేపథ్యంతో పాటు సురేష్ కొండేటి కంటెంట్ సెలక్షన్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు తో ‘ప్రేమనే ఊరిలో’ మరో మంచి చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పర్ఫెక్ట్ అవుట్ పుట్ తో ఈ సెప్టెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నామని మేకర్స్ చెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed