కర్నాటక రాష్ట్రంలోని ముద్దేనహళ్లి సత్యసాయి గ్రామంలోని వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఆధ్వర్యంలోని శ్రీ మధుసూదన్ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (SMSIMSR) లో శనివారం రెండు రోజుల అంతర్జాతీయ ఎండోస్కోపిక్ అండ్ రోబోటిక్ కార్డియాక్ సర్జరీ కాన్ఫరెన్స్ (IERCSC 2026) ప్రారంభమైంది. దేశంలోనే ఓ ఉచిత ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఇలాంటి అరుదైన సదస్సు జరగడం ఇదే తొలిసారి. మణిపాల్ హాస్పిటల్స్, ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో భారత్, గ్రీస్, అమెరికా, చైనా, బ్రెజిల్, యుక్రెయిన్, జర్మనీ, వియత్నాం సహా పలు దేశాలకు చెందిన గుండె శస్త్రచికిత్స నిపుణులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.














