Last Updated:
బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కుర్రోడు రంగుభుక్త రాము తన కలను నిజం చేసుకోవడం కోసం భాగ్యనగరంలో సారథి ప్రేమ సినిమా తీశారు. ప్రస్తుతం ఈ సినిమా యూట్యూబ్‌లో మంచి డిమాండ్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టార్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే మంచి సినిమాలు తెరకెక్కించవచ్చని తెలియజెప్పేదే ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ చిత్రం. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న యువ దర్శకుడు రంగుభుక్త రాము తన కలను నిజం చేసుకునేందుకు దాదాపు ఏడాదిన్నర పాటు శ్రమించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతలు అంగా రెడ్డి భరత్ రెడ్డి, భరత్ గౌడ్ కూడా కొత్తవారే అయినప్పటికీ.. వారికీ ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
ఈ చిత్రంలో ప్రిన్స్ వంశీ, నిక్కీ చారి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రత్యేక పాత్రలో ఐవీడీ సాయి కనిపించగా.. నితిన్, చోటు, వినయ్, రాజా, హరి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కథకు తగ్గట్టుగా ప్రతి నటుడు తన పాత్రకు న్యాయం చేయడంతో సినిమా మరింత సహజంగా అనిపిస్తుంది. సినిమాకు రామయ్య చెంబోలు కథను అందించగా.. శ్రావణ్ కుప్పిలి సంభాషణలు, అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. సంగీత దర్శకుడు సంపత్.
హైదరాబాద్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ కేవలం 10 రోజుల్లో 1 గంట 10 నిమిషాల నిడివి గల ఈ చిత్రాన్ని పూర్తి చేయడం విశేషం. సినిమా అవుట్‌పుట్‌పై నమ్మకంతో ఇటీవల ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అదే ఉత్సాహంతో ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు ఆనంద్ దేవరకొండ చేతుల మీదుగా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యువత భావోద్వేగాలు, ప్రేమ, స్నేహం, జీవిత పోరాటాలను హృదయానికి హత్తుకునేలా ఈ సినిమాలో చూపించారు. కొత్త టాలెంట్ ఎలా ఉందొ మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














