Last Updated:
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం “స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” అడ్వాన్స్ బుకింగ్స్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ బుకింగ్స్ కి భారీ డిమాండ్ కనిపిస్తోంది.
హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం “స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” అడ్వాన్స్ బుకింగ్స్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సినిమాను మరింత అద్భుతంగా ప్రేక్షకులకు అందించేందుకు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ ఇండియా సంస్థ P[XL], Big Pix, Screen X, ICE, 4DX, MX4D వంటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్లలో విడుదల చేయనుంది. దీంతో అభిమానులు అత్యంత భారీ అనుభూతితో సినిమాను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.
డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్ హాలండ్‌తో పాటు జెండయా, జేకబ్ బటలోన్, జాన్ బెర్న్తాల్, సాడీ సింక్ కీలక పాత్రలు పోషించారు. ప్రపంచం తనను మరచిపోయిన పరిస్థితుల్లో స్పైడర్-మ్యాన్‌గా నేరాలతో పోరాడుతున్న పీటర్ పార్కర్ జీవితంలో చోటుచేసుకునే కొత్త పరిణామాలు, అతను ఎదుర్కొనే రహస్యమైన శత్రువు చుట్టూ ఈ చిత్రం కథ సాగుతుంది.
“స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే” జూలై 30, 2026న 2D, 3D ఫార్మాట్లలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టామ్ హాలండ్ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది సేపట్లోనే హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ సినిమాకు భారీ డిమాండ్ ఉందనే చెప్పుకోవాలి.
ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ రీలీజింగ్ ఇంటర్నేషనల్ ఇండియా హెడ్ షోనీ పంజికరన్ మాట్లాడుతూ.. “భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో స్పైడర్-మ్యాన్‌కు ప్రత్యేక స్థానం ఉంది, అందుకే ఈ చిత్రాన్ని అత్యుత్తమ థియేట్రికల్ అనుభూతితో అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాము” అని తెలిపారు. అలాగే పీవీఆర్ ఐనాక్స్ రెవెన్యూ అండ్ ఆపరేషన్స్ సీఈవో గౌతమ్ దత్త మాట్లాడుతూ… “స్పైడర్-మ్యాన్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఫ్రాంచైజీ. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై అభిమానులతో కలిసి వీక్షించడం మరపురాని అనుభూతిని అందిస్తుంది” అని అన్నారు.
సినిమా న్యూస్, మూవీ అప్డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













