‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్’ తెలుగు ట్రైలర్‌.. హీ-మ్యాన్‌గా నిఖిల్ సిద్ధార్థ వాయిస్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది.

News18
News18

హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం ‘హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్’ ఇప్పుడు ఇండియన్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన ఇంగ్లీష్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన తెలుగు ట్రైలర్ తెలుగు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చింది.

తెలుగు వెర్షన్‌లో హీరో హీ-మ్యాన్ పాత్రకు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తన వాయిస్ అందిస్తున్నారు. కార్తికేయ, కార్తికేయ 2, స్పై సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్ ఇప్పుడు ఈ ఐకానిక్ పాత్రకు డబ్బింగ్ చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక విలన్ స్కెలెటర్ పాత్రకు ప్రముఖ నటుడు ఆదిత్య మీనన్ తన బేస్ వాయిస్‌ను అందించగా, డంకన్ పాత్రకు సీనియర్ నటుడు రావు రమేష్ వాయిస్ ఇవ్వడం విశేషం. ఈ పవర్‌ఫుల్ తెలుగు వాయిస్ కాస్ట్ కారణంగా ‘ఎటెర్నియా’ ప్రపంచంలోని యాక్షన్, ఎమోషన్, ఫాంటసీ వంటి అంశాలు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవనున్నాయి.

అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ నిర్మాణంలో, ట్రావిస్ నైట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నికోలస్ గలిట్జైన్ ప్రిన్స్ ఆడమ్/హీ-మ్యాన్‌గా నటిస్తుండగా, కమిలా మెండెస్ టీలా పాత్రలో కనిపించనున్నారు. అలాగే జారెడ్ లెటో స్కెలెటర్ పాత్రలో నటిస్తుండగా, మ్యాన్-అట్-ఆర్మ్స్ పాత్రలో ఇడ్రిస్ ఎల్బా కనిపించనున్నారు. అలిసన్ బ్రి, మొరెనా బక్కారిన్, క్రిస్టెన్ విగ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ‘హీ-మ్యాన్’ ప్రపంచాన్ని కొత్త తరానికి గ్రాండ్‌గా పరిచయం చేయబోతోంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ అంతర్జాతీయంగా విడుదల చేయనుంది. జూన్ 5వ తేదీన ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం భాషలలో భారత దేశంలో విడుదల కానుంది.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *