హే చికీతా మూవీ రివ్యూ.. ఈ పల్లెటూరి ప్రేమకథ ఎలా ఉందంటే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

నేడు (జూలై 24) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పక్కా పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వింటేజ్ విలేజ్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

News18
News18

నేడు (జూలై 24) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పక్కా పల్లెటూరి ప్రేమకథా చిత్రం ‘హే చికీతా’. అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ధన్‌రాజ్ లెక్కల దర్శకత్వం వహించారు. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వింటేజ్ విలేజ్ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథా నేపథ్యం:

నాగనూరు, లచ్చక్క పేట అనే రెండు గ్రామాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. చదువు అబ్బక, ఊర్లోనే వ్యవసాయం చేసుకునే ముక్కుసూటి కుర్రాడు శివ (అభినవ్). అతనికి చిట్టి (దివిజ), పొట్టి (తన్మయ్) అని ఇద్దరు మరదళ్లు. శివ, చిట్టి చిన్నప్పటి నుంచే గాఢంగా ప్రేమించుకుంటారు. కానీ, చిట్టి తండ్రి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవాడికే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానని పట్టుబడతాడు. వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వనని భీష్మించుకు కూర్చుంటాడు. ఈలోపు ఊళ్లో జరిగిన ఓ గొడవలో కత్తితో దాడి చేసిన శివ జైలు పాలవుతాడు. జైలు నుంచి వచ్చిన శివ తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు? అన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

విశ్లేషణ:

దర్శకుడు ధన్‌రాజ్ యూత్‌ఫుల్ ప్రేమకథకు, ‘రైతే రాజు’ అనే బలమైన సామాజిక సందేశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన తీరు అభినందనీయం. ఆరంభంలో పాత్రల పరిచయంతో కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, హీరో గ్యాంగ్ అల్లరి, బావామరదళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. వినాయక నిమజ్జనం గొడవలతో వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో రైతుల కష్టాలు, వ్యవసాయం గొప్పదనం, వారిపై సమాజంలో ఉన్న చిన్నచూపును కళ్లకు కట్టినట్లు చూపించిన సన్నివేశాలు ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తాయి. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా, కుటుంబ సమేతంగా చూసేలా సినిమాను రూపొందించారు.

నటీనటులు & సాంకేతిక వర్గం:

శివ పాత్రలో అభినవ్ పక్కింటి కుర్రాడిలా ఒదిగిపోయాడు. దివిజ, తన్మయ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాజన్నగా దేవి ప్రసాద్, కల్లు మామ పాత్రలు కథలో కీలకంగా నిలుస్తాయి. సాంకేతికంగా ‘గరుడవేగ’ అంజి కెమెరా వర్క్ పల్లెటూరి అందాలను సహజంగా బంధించింది. చరణ్ అర్జున్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి. నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా చాలా ఉన్నతంగా ఉన్నాయి.

ఓవరాల్‌గా చెప్పాలంటే.. యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి సామాజిక సందేశం ఉన్న చక్కటి కుటుంబ కథా చిత్రం ఈ ‘హే చికీతా’.

రేటింగ్: 2.75

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed