ఇరాన్ యురేనియంపై ట్రంప్ సంచలన ప్రకటన.. అమెరికాకు అప్పగించాలని డిమాండ్ | | ACTPnews

యూఎస్ - ఇరాన్ వార్


Last Updated:

ఇరాన్ వద్ద ఉన్న యురేనియాన్ని వెంటనే అమెరికాకు అప్పగించి తరలించి ధ్వంసం చేయడం లేదా ఇరాన్ సమన్వయంతో అంతర్జాతీయ పర్యవేక్షణలో నిర్వీర్యం చేయడం జరుగుతుందని ట్రంప్ తెలిపారు.

యూఎస్ - ఇరాన్ వార్
యూఎస్ – ఇరాన్ వార్

పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న విస్తృత ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు దోహాలో కీలక చర్చలు కొనసాగుతున్న సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చల్లో అత్యంత వివాదాస్పద అంశమైన ఇరాన్ సుసంపన్న యురేనియం నిల్వలపై కీలక ప్రకటన చేశారు.

న్యూస్ 18 ఇంగ్లీష్‌లో వచ్చిన కథనంలో ఇరాన్, అమెరికా శాంతి చర్చలపై ముఖ్యమైన అప్‌డేట్ వచ్చింది. ఇందులో రాసిన వివరాలు ప్రకారం.. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్, ఈ సుసంపన్న యురేనియాన్ని “న్యూక్లియర్ డస్ట్!”గా పేర్కొన్నారని తెలిపింది. దీన్ని వెంటనే అమెరికాకు అప్పగించి తరలించి ధ్వంసం చేయడం లేదా ఇరాన్‌తో సమన్వయంతో అంతర్జాతీయ పర్యవేక్షణలో నిర్వీర్యం చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ ప్రక్రియ మొత్తం అటామిక్ ఎనర్జీ కమిషన్ లేదా దానికి సమానమైన అంతర్జాతీయ సంస్థ పర్యవేక్షణలో సాగుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య కుదిరే ఏదైనా ఒప్పందంలో అంతర్జాతీయ పర్యవేక్షణ కీలక భాగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ట్రంప్ వ్యాఖ్యలు ఖతార్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న దౌత్య చర్చల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరాన్ అధికారులు, అమెరికా ప్రతినిధులు మరియు ఖతార్ మధ్యవర్తులు కలిసి కాల్పుల విరమణకు రూపకల్పన చేయడం, హోర్ముజ్ జలసంధిలో సముద్ర భద్రత పునరుద్ధరించడం, అలాగే ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత చర్చలను తిరిగి ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా అమెరికా వైఖరిలో మార్పుకు సంకేతాలుగా భావిస్తున్నారు. ఇప్పటివరకు అమెరికా, ఇరాన్ భూభాగం నుంచి యురేనియాన్ని పూర్తిగా తొలగించాలనే దృఢమైన వైఖరిని తీసుకుంది. అయితే తాజా వ్యాఖ్యల్లో ట్రంప్, అంతర్జాతీయ పర్యవేక్షణలో ఇరాన్‌లోనే యురేనియాన్ని నిర్వీర్యం చేసే అవకాశాన్ని సూచించారు. ఇది చర్చల సమయంలో టెహ్రాన్ కోరుతున్న డిమాండ్‌కు దగ్గరగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇరాన్ మాత్రం తన అణు పదార్థాలను విదేశాలకు తరలించడాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోంది. దేశ సార్వభౌమాధికారాన్ని, పౌర అణు హక్కులను కాపాడుతూ ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించే విధంగా మాత్రమే ఏ ఒప్పందమైనా ఉండాలని టెహ్రాన్ స్పష్టం చేస్తోంది.

ఇరాన్ సుసంపన్న యురేనియం నిల్వలు ఈ చర్చల్లో అతిపెద్ద వివాదాస్పద అంశంగా కొనసాగుతున్నాయి. అమెరికా కఠిన నియంత్రణలు, నిర్వీర్య చర్యలను కోరుతుండగా, ఇరాన్ మాత్రం ఆంక్షల సడలింపు మరియు తన పౌర అణు కార్యక్రమాలకు హామీలు ఇవ్వాలని పట్టుబడుతోంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports