ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. అరుదైన ఘనత సాధించిన ఒకేఒక్కడు ! | క్రీడా వార్తలు | ACTPnews

News18


Last Updated:

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు (279) ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ధోనీ, రోహిత్ శర్మలను అధిగమించిన కోహ్లీ, ఒకే జట్టు తరపున 19 సీజన్లు ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్రకెక్కాడు.

News18
News18

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లు (279) ఆడిన ఆటగాడిగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 278 మ్యాచ్‌లతో సమంగా ఉన్న ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలను కోహ్లీ ఈరోజు అధిగమించాడు. 2008 నుండి ఇప్పటివరకు 19 సీజన్లుగా ఒకే జట్టు (ఆర్సీబీ) తరపున ఆడుతున్న ఏకైక ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.

మరోవైపు ఈ మ్యాచ్‌లో కోహ్లీ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. కోహ్లీ మరో 78 పరుగులు చేస్తే, టీ20 ఫార్మాట్‌లో 14,000 పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం అతను 426 టీ20 మ్యాచ్‌ల్లో 13,922 పరుగులతో ఉన్నాడు. కేకేఆర్ స్టార్ సునీల్ నరైన్ కూడా ఈ మ్యాచ్‌తో ఒకే జట్టు తరపున తన 199వ మ్యాచ్ ఆడుతూ ఈ జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకే ప్రాంచైజీకి సుదీర్ఘ కాలం సేవలందిస్తూ, అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనతను విరాట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీ అభిమానులు కింగ్ కోహ్లీ సాధించిన ఈ ఫీట్‌ను సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

Most matches in IPL

PLAYER TEAM(S) MATCHES RUNS WICKETS
Virat Kohli Royal Challengers Bengaluru 279* 9040* 4*
MS Dhoni Chennai Super Kings, Rising Pune Supergiants 278 5439 0
Rohit Sharma Deccan Chargers, Mumbai Indians 278 7289 15
Ravindra Jadeja Rajasthan Royals, Kochi Tuskers Kerala, Chennai Super Kings, Gujarat Lions 265 3450 178
Dinesh Karthik Delhi Capitals, Punjab Kings, Royal Challengers Bengaluru, Mumbai Indians, Gujarat Lions, Kolkata Knight Riders 257 4842 0
Shikhar Dhawan Mumbai Indians, Delhi Capitals, Deccan Chargers, Sunrisers Hyderabad, Punjab Kings 222 6769 4
Ravichandran Ashwin Chennai Super Kings, Rising Pune Supergiants, Punjab Kings, Delhi Capitals, Rajasthan Royals 221 833 187
Ajinkya Rahane Mumbai Indians, Rajasthan Royals, Rising Pune Supergiants, Delhi Capitals, Kolkata Knight Riders, Chennai Super Kings 209* 5250* 1*
Suresh Raina Chennai Super Kings, Gujarat Lions 205 5528 25
Robin Uthappa Mumbai Indians, Royal Challengers Bengaluru, Pune Warriors India, Kolkata Knight Riders, Rajasthan Royals, Chennai Super Kings 205 4952 0
Most appearances in IPL by one team players

PLAYER COUNTRY TEAM MATCHES RUNS WICKETS
Virat Kohli India Royal Challengers Bengaluru 279* 9040 4*
Sunil Narine West Indies Kolkata Knight Riders 199* 1820* 202*
Kieron Pollard West Indies Mumbai Indians 189 3412 69
Jasprit Bumrah India Mumbai Indians 156 75 186
Lasith Malinga Sri Lanka Mumbai Indians 122 88 170
Subramaniam Badrinath India Chennai Super Kings 95 1441 0
Riyan Parag India Rajasthan Royals 94 1773 9
Arshdeep Singh India Punjab Kings 93 32 110

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports