సిద్దు రెడ్డి కందకట్ల, కాత్యాయని జగన తో పాటు నటి వైష్ణవి చైతన్య, నిలోఫర్ కేఫ్ అధినేత బాబూరావు తదితరులు కార్యక్రమానికి హాజరై మద్దతు తెలిపారు.
జాబ్ మేళాలో 70కిపైగా ఐటీ, నాన్-ఐటీ సంస్థలు పాల్గొని 1,000కిపైగా ఉద్యోగావకాశాలు కల్పించాయి. అభ్యర్థులకు ఆయా సంస్థల ప్రతినిధులతో నేరుగా మాట్లాడే అవకాశం కల్పించడంతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి స్పాట్ ఆఫర్ లెటర్లు అందించే అవకాశం కల్పించారు.
టీసీఎస్, సగాలిటీ, టెలిపర్ఫార్మెన్స్, హెచ్జీఎస్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, డిజిటైడ్, జెన్పాక్ట్, జస్ట్‌డయల్, రిలయన్స్ డిజిటల్, యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, నియాన్ మోటార్స్ తదితర సంస్థలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఐటీ, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, లాజిస్టిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మసీ, నర్సింగ్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, హాస్పిటాలిటీ, సేల్స్, డ్రైవింగ్, ఇంజినీరింగ్, అకౌంట్స్, వాయిస్, నాన్-వాయిస్ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులో ఉంచారు.
10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీకాం, ఎంబీఏతో పాటు ఇతర డిగ్రీలు చదివిన అభ్యర్థులకు అవకాశాలు కల్పించారు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులు కూడా మేళాలో పాల్గొన్నారు.
300 మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబాలకు ఆరోగ్య బీమా 3 లక్షలు అది వివిధ సందర్భాల్లో ఉపయోగించుకునేటట్లు, సహాయం అందించినట్లు, అనుకోని సంఘటనలో జరిగితే 10 లక్షల 50 వేల రూపాయలు ఆర్థిక సాయం గా ఉండనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు జాబ్ మేళా నిర్వహించినట్లు పేర్కొన్నారు.
‘ఓ నా సిద్ధయ్య’ పాట రూపకల్పనలో పనిచేసిన డైరెక్షన్, కెమెరా, ఇతర సాంకేతిక విభాగాల సభ్యులకు బీమా సహాయం అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ప్రాజెక్టు వెనుక పనిచేసిన సాంకేతిక నిపుణులకు అండగా నిలవడమే దీని ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ‘ఓ నా సిద్ధయ్య’కు కళ్యాణ్ కీస్ సంగీతం అందించగా.. రామ్ అద్నాన్ సాహిత్యం, దర్శకత్వం వహించారు. రామ్ అద్నాన్, శ్రీనిధి గానం చేశారు. అరుణ్ కొలుగూరి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.













