Last Updated:
ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి కొలువుదీరాడు. గవర్నర్ తొలి పూజలో పాల్గొననున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కూడా దర్శించుకోనున్నారు.
హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి మొదలైపోయింది. నగరంలోని ప్రధాన గణేష్ మండపాలు భారీ ఏర్పాట్లతో సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి ఈసారి మరింత ప్రత్యేకంగా కనిపించబోతున్నాడు. 69 అడుగుల ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో కొలువుదీరిన భారీ గణేష్ భక్తులకు కనువిందు చేయనున్నాడు. ఐదు పడగలు, పంచముఖాలతో తీర్చిదిద్దిన ఈ విగ్రహానికి ఒకవైపు సోమనాథ్ జ్యోతిర్లింగం, మరోవైపు కాళికామాత విగ్రహాలను ఏర్పాటు చేశారు.














