Last Updated:
ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సెప్టెంబర్ 12-24 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించారు.
హైదరాబాద్ ఖైరతాబాద్ మహా గణేశ్‌ను దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే కారో, బైకో తీసుకుని బయల్దేరే ముందు ఒక్కసారి ఈ రూట్లను చూసుకోవాల్సిందే. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఆంక్షలు, వాహనాల మళ్లింపులు చేపట్టనున్నారు. సెప్టెంబర్ 12 నుంచి 24 వరకు పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారు.














