తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. అక్టోబరు 12 నుంచి 20 వరకు వాహనసేవల వివరాలు ఇవే! | | ACTPnews

News18


Last Updated:

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. గరుడ వాహనం, పుష్పక విమానం, స్వర్ణరథోత్సవం, చక్రస్నానం వంటి ముఖ్యమైన సేవల తేదీలు, సమయాల వివరాలు తెలుసుకోండి. అక్టోబర్ 11న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

News18
News18

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 12 నుంచి 20వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. అధికమాసం సందర్భంగా వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో ధ్వజారోహణం, ధ్వజావరోహణం ఉండవు. ప్రధానంగా అక్టోబరు 16న గరుడ వాహనం, 17న పుష్పక విమానం, 19న స్వర్ణరథం, 20న చక్రస్నానం నిర్వహించనున్నారు.

అక్టోబరు 11న రాత్రి అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అక్టోబరు 12న పెద్దశేష వాహనం, 13న చిన్నశేష వాహనం, హంస వాహనం, 14న సింహ వాహనం, ముత్యపుపందిరి వాహనం, 15న కల్పవృక్ష, సర్వభూపాల వాహనసేవలు జరగనున్నాయి. అక్టోబరు 16న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహనం, 17న హనుమంత వాహనం, పుష్పక విమానం, గజ వాహనం, 18న సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలు నిర్వహించనున్నారు.

అక్టోబరు 19న ఉదయం 7 గంటలకు స్వర్ణరథోత్సవం, రాత్రి అశ్వ వాహనసేవ, అక్టోబరు 20న ఉదయం 6 గంటలకు చక్రస్నానం నిర్వహించనున్నారు. ఉదయం వాహనసేవలు సాధారణంగా 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి వాహనసేవలు 7 నుంచి 9 గంటల వరకు జరుగుతాయి. గరుడ వాహనసేవ సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను టీటీడీ చేపడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed