పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత.. ఆ కల నెరవేరకముందే విషాదం..! | తెలంగాణ వార్తలు | ACTPnews

News18


Last Updated:

పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం విషాదాన్ని నింపింది.హనుమకొండ నగరంలోని హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన పొనుగోటి నిరంజన్(17) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

+

News18

పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం విషాదాన్ని నింపింది.హనుమకొండ నగరంలోని హనుమాన్ నగర్ ప్రాంతానికి చెందిన పొనుగోటి నిరంజన్(17) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

పొనుగోటి రాము-మానస దంపతుల కుమారుడు నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నారు. నిరంజన్ చిన్ననాటి నుంచే పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్ ను కలవాలన్న ఆశతో ఉన్నాడు.

ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచానికే పరిమితమైన తన అభిమాని నిరంజన్ ను కలిస జూన్ 17న హనుమకొండకు వెళ్లి నిరంజన్ ను పరామర్శించి, తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అందజేసి శాలువ కప్పి,అక్షింతలు వేసి నిరంజన్ ను హత్తుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ నటన డైలాగులను అనుకరిస్తూ నిరంజన్ చేసిన వీడియోలను చూసి పవన్ ఆనందించారు.అనంతరం జనసేనకు సంబంధించిన డైరీలో ‘ప్రియమైన నిరంజన్ కు ప్రేమతో ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్’ అని రాసి సంతకం చేసి ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రాకతో ఆ కుటుంబంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ నిరంజన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నిరంజన్ కు ధైర్యం కల్పించి మనిద్దరం కలిసి “OG 2” సినిమా చూద్దామని “OG2” వస్తే నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని ఆ బాలుడికి మాట ఇచ్చారు. కానీ ఆ కళ నిజమయ్యేలోపే అభిమాని నిరంజన్ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు.

‘ద్యుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీతో జన్యుపరమైన వ్యాధితో’ గత కొంతకాలంగా నిరంజన్ బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా క్రమంగా కండరాలు బలహీనపడడంతో పాటు ఎదుగుదల ఆగిపోతుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి ఎలాంటి శాశ్వత చికిత్స లేదు. కాలక్రమమైన నిరంజన్ ఆరోగ్యం కిడ్నీలు కూడా దెబ్బ తినడంతో పలు ఆసుపత్రిలో చికిత్స అందించిన ఆరోగ్యం కుదుటపడలేదు. ప్రస్తుతం నిరంజన్ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తన ఆరోగ్యం క్షీణించడంతో బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

నిరంజన్ మృతితో వారి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. హనుమకొండలోని హనుమాన్ నగర్ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా అతనితో భేటి కావడం జ్ఞాపకంగా మిగిలిపోగా కొన్ని రోజులకె నిరంజన్ మృతి చెందడం అటు కుటుంబ సభ్యులను,పవన్ అభిమానులను తీవ్రంగా కలిచివేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed