సౌత్ ఇండియన్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా.. మనసులో మాట చెప్పిన నిథి అగర్వాల్..! nidhi agarwal wedding wish south indian boy. | | ACTPnews

News18


Last Updated:

నటి నిథి అగర్వాల్ తిరుపతిపై అభిమానం వ్యక్తం చేశారు. పెళ్లి తర్వాత భర్తతో తిరుమల దర్శనం తన కోరికని, ప్రస్తుతం కెరీర్‌పైనే దృష్టి అని తెలిపారు. సౌత్ ఇండియన్ యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఆమె కోరుకుంటున్న

+

News18

సినీ నటి నిథి అగర్వాల్ మరోసారి తిరుపతిపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి అంటే తనకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధమని చెప్పిన ఆమె, వివాహం జరిగిన తర్వాత భర్తతో కలిసి తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలని తన మనసులోని కోరికను వెల్లడించారు. ప్రస్తుతం మాత్రం తన దృష్టంతా సినీ కెరీర్‌పైనే ఉందని, పెళ్లి గురించి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

పెళ్లి విషయంలో తొందరపడే ఆలోచన తనకు లేదని చెప్పిన నిథి అగర్వాల్, ఇప్పటివరకు తనకు సరైన జీవిత భాగస్వామి దొరకలేదని చిరునవ్వుతో వ్యాఖ్యానించారు. జీవితాంతం కలిసి ప్రయాణించే వ్యక్తి మంచి మనసున్నవాడై ఉండాలని కోరుకుంటున్నానని, ముఖ్యంగా సౌత్ ఇండియన్ యువకుడినే వివాహం చేసుకోవాలనే కోరిక తనలో ఉందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి.

సినీ ప్రయాణం గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ముంబైలో రెండు హిందీ చిత్రాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నానని నిథి తెలిపారు. అదే సమయంలో మరో రెండు తెలుగు సినిమాలకు కూడా సంతకం చేసినట్లు వెల్లడించారు. ఆ చిత్రాల చిత్రీకరణలు వరుసగా ఆగస్టు, అక్టోబర్ నెలల్లో ప్రారంభం కానున్నాయని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.

తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణను ఎప్పటికీ మరచిపోలేనని నిథి అగర్వాల్ అన్నారు. అభిమానుల అభిమానమే తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని పేర్కొన్న ఆమె, మరిన్ని మంచి కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. తెలుగు ప్రేక్షకులతో తన అనుబంధం మరింత బలపడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ఆగస్టు 17న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకలు ఉండనున్నాయని నిథి అగర్వాల్ వెల్లడించారు. కొత్త సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలతో పాటు మరికొన్ని సర్‌ప్రైజ్‌లు కూడా ఆ రోజే ప్రకటించనున్నట్లు చెప్పడంతో ఆమె అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో నిథి అగర్వాల్ కొత్త ప్రాజెక్టులు ఏమిటన్న దానిపై సినీ వర్గాల్లో కూడా చర్చ మొదలైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed