బిగ్ బాస్ ఫేమ్ భరణి చేతుల మీదుగా అను ఫర్నీచర్ ప్రారంభం.. ఎక్కడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

బిగ్ బాస్ ఫేమ్ భరణి చేతుల మీదుగా అను ఫర్నీచర్ ప్రారంభం.. ఎక్కడంటే? | తెలుగు సినిమా వార్తలు


ఈ నూతన షోరూమ్‌ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, బిగ్‌బాస్ ఫేమ్ నటుడు భరణి శంకర్ జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు సినీ, టెలివిజన్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

నటుడు భరణి శంకర్ మాట్లాడుతూ, “నేను కూడా మా ఇంటి కోసం అను ఫర్నిచర్ నుంచి అనేక వస్తువులు కొనుగోలు చేశాను. వాటి నాణ్యత, ఫినిషింగ్, డిజైన్లు చాలా బాగుంటాయి. మంచి క్వాలిటీని సరసమైన ధరల్లో అందించడం అను ఫర్నిచర్ ప్రత్యేకత. వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సంస్థ మరింత ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మాట్లాడుతూ, “32 సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకుంటూ అను ఫర్నిచర్ నిరంతరం అభివృద్ధి చెందడం అభినందనీయమైన విషయం. ఒక చిన్న సంస్థగా ప్రారంభమై నేడు 19వ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ప్రారంభించడం సంస్థ నిబద్ధతకు నిదర్శనం. నాణ్యత, ఆధునిక డిజైన్లు, వినియోగదారుల సంతృప్తిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న అను ఫర్నిచర్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సంస్థ యాజమాన్యానికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు” అని అన్నారు.

అను ఫర్నిచర్ మేనేజింగ్ డైరెక్టర్ రమణ రెడ్డి మాట్లాడుతూ, “32 ఏళ్ల క్రితం చిన్న స్థాయిలో ప్రారంభమైన అను ఫర్నిచర్‌కు వినియోగదారులు చూపిన అపారమైన ఆదరణ వల్ల నేడు 19వ స్టోర్‌ను ప్రారంభించే స్థాయికి చేరుకున్నాం. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ నాణ్యతతో, ఆధునిక డిజైన్లతో, అందుబాటు ధరల్లో ఫర్నిచర్ అందించడం మా లక్ష్యం. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మరిన్ని శాఖలను ప్రారంభించి అను ఫర్నిచర్‌ను మరింత విస్తరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం” అని తెలిపారు.

డైరెక్టర్ అక్షిత మాట్లాడుతూ, “అత్యాధునిక సాంకేతికతను వినియోగించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫర్నిచర్‌ను వినియోగదారులకు అందిస్తున్నాం. నమ్మకం, నాణ్యత, ఉత్తమ సేవలే మా విజయానికి మూలాధారం. ప్రతి కస్టమర్ సంతృప్తే మా సంస్థ ఎదుగుదలకు ప్రధాన కారణం. భవిష్యత్తులో మరింత మెరుగైన ఉత్పత్తులు, సేవలను అందించేందుకు కృషి చేస్తాం” అని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక హోమ్, ఆఫీస్ ఫర్నిచర్‌ను అందుబాటు ధరల్లో అందిస్తున్నామని తెలిపారు. షోరూమ్‌లో సోఫాలు, డైనింగ్ సెట్లు, బెడ్‌రూమ్ ఫర్నిచర్, మాడ్యులర్ కిచెన్, ఆఫీస్ ఫర్నిచర్, ప్రీమియం ఇంటీరియర్ సొల్యూషన్స్‌తో పాటు విభిన్న శ్రేణి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఈ గ్రాండ్ ఓపెనింగ్ వేడుకను జైదీప్ ఆధ్వర్యంలోని ఫిఫ్త్ మీడియా సంస్థ అత్యంత వైభవంగా నిర్వహించింది. కార్యక్రమంలో అను ఫర్నిచర్ ప్రతినిధులు, సిబ్బంది, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఆహ్వానితులు, పెద్ద సంఖ్యలో వినియోగదారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed