‘భారత్ చాలా శక్తివంతమైన దేశం’.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ప్రశంసలు | | ACTPnews

News18


Last Updated:

భారతదేశ సాయుధ దళాల బలోపేతం, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శనివారం ప్రసంశల వర్షం కురుపించారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్ ఒక “శక్తివంతమైన” శక్తిగా, వ్యూహాత్మకమైన స్తంభంగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు.

News18
News18

భారతదేశ సాయుధ దళాల బలోపేతం, సైనిక ఆధునీకరణ ప్రయత్నాలపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ శనివారం ప్రసంశల వర్షం కురుపించారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడటంలో భారత్ ఒక “శక్తివంతమైన” శక్తిగా, వ్యూహాత్మకమైన స్తంభంగా నిలుస్తోందని ఆయన అభివర్ణించారు.

సింగపూర్‌లో జరుగుతున్న ప్రముఖ అంతర్జాతీయ భద్రతా సదస్సు ‘షాంగ్రి-లా డైలాగ్’ (Shangri-La Dialogue) లో పీట్ హెగ్సెత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉన్నత స్థాయి సైనిక కార్యకలాపాలకు, వ్యూహాత్మక సవాళ్లకు అనుగుణంగా న్యూఢిల్లీ తన సైనిక సామర్థ్యాలను గణనీయంగా బలోపేతం చేసుకుంటోందని, అందుకోసం పారిశ్రామిక, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను విస్తరిస్తోందని ఆయన కొనియాడారు.

భారీ సామర్థ్యాన్ని నిర్మిస్తున్న భారత్: యుఎస్ రక్షణ మంత్రి

భారతదేశం కేవలం రక్షణ రంగంలోనే కాకుండా పారిశ్రామికంగా కూడా ఎంతో బలపడుతోందని డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్థుడైన పీట్ హెగ్సెత్ పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడుతూ వివరించారు. “భారతదేశం ఎంతో శక్తివంతమైనది. తన సైన్యాన్ని నిరంతరం ఆధునీకరిస్తోంది. ఉన్నత స్థాయి అంతర్జాతీయ సైనిక కార్యకలాపాలను సుదీర్ఘకాలం కొనసాగించడానికి వీలుగా అది భారీ పారిశ్రామిక, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని నిర్మించుకుంటోంది” అని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాసియా ప్రాంతంలో చైనా వంటి శక్తుల విస్తరణను అడ్డుకుంటూ వ్యూహాత్మక సమతుల్యతను కాపాడటంలో భారతదేశం ఒక కీలకమైన ఆసరాగా నిలిచిందని హెగ్సెత్ పేర్కొన్నారు. తన స్వప్రయోజనాల కోసం పనిచేసే బలమైన భారతదేశం, ఈ ప్రాంతమంతటా శాంతిభద్రతలను కాపాడాలనే అమెరికా ఉమ్మడి వ్యూహాత్మక లక్ష్యానికి ఎంతో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రక్షణ రంగంలో సహ-ఉత్పత్తి..

భారతదేశ సైనిక అవసరాలు, స్వయంసమృద్ధిని పెంపొందించడానికి అమెరికా కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హెగ్సెత్ వెల్లడించారు. భారతదేశంతో కలిసి అధునాతన రక్షణ పరికరాలను సంయుక్తంగా తయారు చేయడానికి (Co-production) వాషింగ్టన్ కట్టుబడి ఉందని చెప్పారు. అమెరికా తన రక్షణ రంగంలో జాతీయ తయారీ విధానాన్ని మరింతగా ప్రపంచీకరిస్తోందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య రక్షణ సహకారం గత కొన్నేళ్లుగా వేగంగా విస్తరిస్తోందని చెప్పడానికి ‘జావెలిన్’ (Javelin) యాంటీ-ట్యాంక్ గైడెడ్ మ్యూనిషన్స్ వంటి అధునాతన క్షిపణి వ్యవస్థల సంయుక్త ఉత్పత్తి కార్యక్రమాలే నిదర్శనమని హెగ్సెత్ సూచించారు. ఇటువంటి భాగస్వామ్యాలు ఇరు దేశాల సాయుధ దళాల సంసిద్ధతను మెరుగుపరచడంలో ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన కొనియాడారు.

గ్లోబల్ భద్రతపై ‘షాంగ్రి-లా’ వేదికగా కీలక చర్చలు..

ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికాకు ఉన్న ఇతర మిత్రదేశాలైన జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, ఆసియాన్ (ASEAN) దేశాలతో ఉన్న రక్షణ సంబంధాలను కూడా హెగ్సెత్ సమీక్షించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత కీలకమైన వ్యూహాత్మక భద్రతా జోన్ అని, ఇక్కడి మిత్రదేశాలు తమ రక్షణ సామర్థ్యాలలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరారు.

ఇవి కూడా చదవండి: Gas Cylinder Booking: గ్యాస్ సిలిండర్లపై కేంద్రం హై అలర్ట్.. మరోసారి వంటగ్యాస్ కొరత వస్తుందా?

ఏ ఒక్క దేశం కూడా ఇతర చిన్న దేశాల భద్రతకు ముప్పు కలిగించే విధంగా ఆధిపత్యాన్ని చెలాయించడానికి అనుమతించకూడదని చైనాను ఉద్దేశించి ఆయన హెచ్చరించారు. ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన భద్రతా వేదికలలో ఒకటైన ఈ ఏడాది ‘షాంగ్రి-లా డైలాగ్’ సదస్సులో ప్రాంతీయ మరియు ప్రపంచ భద్రతా సవాళ్లపై చర్చించడానికి దాదాపు 44 దేశాలకు చెందిన సీనియర్ రక్షణ అధికారులు, సైనిక నాయకులు మరియు విధాన రూపకర్తలు ఒకచోట చేరి వ్యూహాలను రచిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *