రష్యాకు పెట్రోల్ కష్టాలు.. ఇంధనం ఎగుమతి చేస్తూ ఆదుకుంటున్న భారత్! | | ACTPnews

News18


Last Updated:

ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో రష్యాలో ఇంధన కొరత తీవ్రస్థాయికి చేరింది. ఈ కష్టకాలంలో రష్యాకు భారత్ భారీగా పెట్రోల్ ఎగుమతి చేస్తూ ఆదుకుంటోంది. గత రెండు నెలల్లో ఏకంగా 10 లక్షల బ్యారెళ్ల ఇంధనాన్ని సరఫరా చేసి రష్యాకు ప్రధాన సరఫరాదారుగా అవతరించింది.

News18
News18

రష్యాకు భారత్ భారీగా పెట్రోల్‌ను ఎగుమతి చేస్తోంది. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులతో రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో అక్కడ ఇంధన ఉత్పత్తి ఏకంగా 70 శాతం పడిపోయి, దేశీయంగా తీవ్ర కొరత ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు రష్యా ఇతర దేశాల వైపు చూస్తోంది. సరిగ్గా ఈ సమయంలో భారత్ రంగంలోకి దిగి గత రెండు నెలల్లో ఏకంగా 10 లక్షల బ్యారెళ్ల పెట్రోల్‌ను రష్యాకు సరఫరా చేసింది. ఆగస్టు నెలలోనే టర్కీ, మొరాకో దేశాలతో పాటు భారత్ నుంచి రష్యాకు రికార్డు స్థాయిలో రోజుకు 1.25 లక్షల బ్యారెళ్ల (సుమారు 4.70 లక్షల టన్నులు) ఇంధనం దిగుమతి అయింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports