రా అండ్ రస్టిక్ మూవీగా అనకాపల్లి.. నిర్మాత నాగవంశీ చేతుల మీదుగా రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. తాజాగా ఈ సినిమా నుంచి ఓ రొమాంటిక్ లవ్ సాంగ్ రిలీజ్ చేశారు.

News18
News18

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న రా అండ్ రస్టిక్‌ చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా చేసిన ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. ఆగస్ట్ 7న చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్‌ను, పాటల్ని రిలీజ్ చేసి అంచనాలు పెంచేశారు.

తాజాగా ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘ఎలగే పిల్ల’ అనే పాటను రిలీజ్ చేసి, చిత్రయూనిట్‌కు అభినందనలు తెలియజేశారు. పాట క్యాచీగా ఉందని, లిరికల్ వీడియోలో విజువల్స్, హీరో వేసిన స్టెప్పులు బాగున్నాయని చిత్రయూనిట్‌ను ప్రశంసించారు. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించాలని ఆయన కోరుకున్నారు.

‘ఎలగే పిల్ల’ అంటూ సాగే ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. కపిల్ కపిలాన్, దేవజండ్ గాత్రం ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. కొరియోగ్రాఫీ కూడా చాలా అందంగా ఉంది. సింపుల్ స్టెప్పుల్ని హీరో విక్రమ్ సహిదేవ్ చాలా గ్రేస్‌తో వేసినట్టుగా లిరికల్ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఇక రీల్స్‌లో ఈ హుక్ స్టెప్పులు ఎక్కువగా వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి.

ఇప్పటికే ‘అమ్మోరు దిగినాది’, ‘లబ్బరు బొమ్మ’ పాటలు యూట్యూబ్‌లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ లవ్ సాంగ్ కూడా ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి మాయా.వి కెమెరామెన్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా పని చేశారు. త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించిన ఈ చిత్రానికి ఉదయ్ భాగవతులు డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ సినిమాలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప, త్రినాధ రావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, కాండ్రేగుల నాయుడు, నందిని రాయ్, సంగీత క్రిష్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. దేవ్ జండ్ సంగీతం అందించారు.

Click here to add News18 as your preferred news source on Google.

సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్‌, రియాల్టీ షోస్‌, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *