హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని.. | తెలంగాణ వార్తలు | ACTPnews

హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని..


Last Updated:

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపాలీ యువకులకు స్థానికులు దేహశుద్ధి చేశారు.

హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని..
హైదరాబాద్ నడిబొడ్డున రెచ్చిపోయిన నేపాలీ కీచకులు.. ఒంటరిగా వెళ్తున్న యువతిని..

మహిళలకు రక్షణ కరువైందా? నడివీధిలో ఒంటరిగా వెళ్తున్న యువతిపై ఆగంతకులు రెచ్చిపోతే చూస్తూ ఊరుకోవాలా? అన్నట్లుగా స్థానికులు వ్యవహరించారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కీచకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించి తమ బాధ్యతను చాటుకున్నారు. భాగ్యనగరంలో మే28న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

హైదరాబాద్ నడిబొడ్డున మహిళల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమయ్యే ఘటన చోటుచేసుకుంది. బషీర్‌బాగ్ సీసీఎస్ (CCS) కార్యాలయం ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిపై కొందరు ఆకతాయిలు వికృత చేష్టలకు పాల్పడ్డారు. ఒంటరిగా వెళ్తున్న ఆ యువతిని గమనించిన ఐదుగురు నేపాలీ యువకులు ఆమె చేయి పట్టి లాగి అసభ్యంగా ప్రవర్తించారు. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు కేకలు వేస్తూ స్థానికుల సహాయం కోరింది.

ఇది కూడా చదవండి: Tribal weddings: ఒకే వేదికపై 168 ఆదివాసి జంటలు.. కనుల పండువగా సామూహిక వివాహాలు.. ఎక్కడంటే..!

యువతి కేకలు విన్న వెంటనే అప్రమత్తమైన స్థానికులు, అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. కీచక పర్వానికి పాల్పడిన ఆ ఐదుగురు నేపాలీ యువకులను పట్టుకుని నిర్బంధించారు. నడిరోడ్డుపై ఓ మహిళ పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులకు సమాచారం అందించారు.

ఇది కూడా చదవండి: Tirumala News: టీటీడీలో రికార్డులు తిరగరాసిన నల్ల బంగారం.. రోజుకు ఎంత మంది తలనీలాలు సమర్పిస్తున్నారంటే.. !

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారు స్థానికంగా ఉన్న ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తున్న సునీల్, ఉమేష్, లక్ష్మణ్, పురుషోత్తం, రామ్ నేవుపనేలుగా గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై అబిడ్స్ పోలీసులు నిర్భయ తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

అందువల్ల ఒంటరిగా వెళ్లే మహిళలకు ఇలాంటి పోకిరీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించాలి. ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగితే వెంటనే పోలీసులకు విషయాన్ని తెలియజేయాలి. వారు సరైన సమయానికి వచ్చి మీకు భద్రత కల్పిస్తారు. వాళ్లను అరెస్ట్ చేస్తారు. ఇంకా వెంటనే చుట్టు పక్కల ఉన్న వారి సహాయం తీసుకోవడం ఉత్తమం. అప్పుడు వారు కీచకులకు దేహశుద్ది చేస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *