ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై రూ. 3 కోట్ల వరకు బీమా! | తెలంగాణ వార్తలు | ACTPnews

ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై రూ. 3 కోట్ల వరకు బీమా!


Last Updated:

సర్కారు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఊరట. కానీ అదే మైనస్.

ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై రూ. 3 కోట్ల వరకు బీమా!
ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఇకపై రూ. 3 కోట్ల వరకు బీమా!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వారికి సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో సరికొత్త ఉచిత జీవిత, ప్రమాద బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 25న లాంఛనంగా ప్రారంభించారు. ఈ విధానం వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న లక్షలాది మంది సిబ్బందికి నేరుగా ప్రయోజనం చేకూర్చనుంది. ఉద్యోగుల శాలరీ అకౌంట్ల ఆధారంగా కోటి రూపాయల నుండి 1.5 కోట్ల రూపాయల వరకు వ్యక్తిగత ప్రమాద మరణ బీమా కవరేజీని ఈ పథకంలో పొందుపరిచారు. విమాన ప్రమాదాల్లో మరణిస్తే బ్యాంకుల నిబంధనల ప్రకారం రెండు కోట్ల నుండి మూడు కోట్ల రూపాయల వరకు బీమా మొత్తం అందనుంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా బ్యాంకులు నిర్దేశించిన ప్రమాద బీమా వర్తిస్తుంది.

స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పసుపులేటి నరేంద్రస్వామి లోకల్18కి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ ఉద్యోగులకు ఆర్థికంగా భరోసా కల్పించనుంది. అయితే ఇప్పటికే బ్యాంకులు అందిస్తున్న బీమా సౌకర్యాలపైనే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, ఈ సదుపాయాన్ని ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా వర్తింపజేస్తే మరింత మేలు జరుగుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ప్రయత్నం బాగున్నప్పటికీ, ఉద్యోగుల కుటుంబాలకు కూడా ఈ రక్షణ కవచం విస్తరించాలని సిబ్బంది కోరుతున్నారు. ఇలాంటి చర్యలు ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

ఇది కూడా చదవండి: జ్ఞానేశ్వరి కేసులో బిగ్ ట్విస్ట్.. కుక్క అందుకే చనిపోయిందా? పోస్టుమార్టం రిపోర్టులో పోలీసులకే షాకిచ్చే విషయాలు?

కేవలం బీమాతో సరిపెట్టకుండా, ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) బలోపేతం కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీనిపై చర్చించేందుకు ఈ నెల 27న సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డ్ సమావేశం జరగనుంది. గతంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం, వైద్య సేవలను మరింత మెరుగుపరచడం ఈ భేటీ ప్రధాన ఉద్దేశ్యం. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఈఓ ఇప్పటికే సంబంధిత అధికారులకు లేఖ జారీ చేశారు. ఆరోగ్య సేవల్లో నాణ్యత పెంచాలని, మరిన్ని ఆసుపత్రులను పథకంలో చేర్చాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Tirupati Bullet Train: తిరుపతికి 2 బుల్లెట్ ట్రైన్స్.. ఏ ఏ పట్టణాల మీదుగా అంటే..

ప్రస్తుతం ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కాంట్రిబ్యూషన్ శాతాన్ని ఒక శాతానికి తగ్గించాలని, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి నిర్ణయించాలని వారు ఆకాంక్షిస్తున్నారు. జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ కట్ చేస్తున్నప్పటికీ, సేవలు సకాలంలో అందడం లేదనే అసంతృప్తి సిబ్బందిలో ఉంది. పెండింగ్ డిఏ, పిఆర్సీ బకాయిల చెల్లింపులో జరుగుతున్న జాప్యం ఆందోళన కలిగిస్తోంది. కేవలం ఆరోగ్య పథకాలకే పరిమితం కాకుండా, తమ ఆర్థిక ప్రయోజనాలను కూడా సకాలంలో అందించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని సిబ్బంది కోరుతున్నారు. బకాయిలు చెల్లించి, ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తేనే వారు ప్రశాంతంగా, భరోసాతో విధులు నిర్వర్తించగలరు. ప్రభుత్వాలు చిన్నపాటి పథకాలతో సరిపెట్టకుండా, సమస్యల మూలాలను గుర్తించి పరిష్కరించాలి. అప్పుడే పాలనలో పారదర్శకత, ఉద్యోగుల సంతృప్తి పెరుగుతాయి. మొత్తానికి ప్రభుత్వం ఉద్యోగ వర్గాల కోసం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతవరకు క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed