ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి.. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఫైర్.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు..! | ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ వార్తలు (Andhra Pradesh Politics) | ACTPnews

Pawan Kalyan: 'ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతి మాత్రమే'.. అమరావతిపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నిరసనలు, కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయలేదని ఆరోపణలు, మేనిఫెస్టో దహన యత్నాలు, జూన్ 8, 12న మరిన్ని కార్యక్రమాలు ప్రకటింపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామాల నుంచి పట్టణాల వరకు, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాల వరకు వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు అనే నినాదంతో నిర్వహించిన ఈ నిరసనల్లో కూటమి మేనిఫెస్టోనే ప్రధాన అస్త్రంగా మార్చుకుంది వైసీపీ. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ అనేక ప్రాంతాల్లో మేనిఫెస్టో ప్రతులను దగ్ధం చేయడానికి ప్రయత్నించారు. కొన్ని చోట్ల పోలీసులు జోక్యం చేసుకుని నిరసనకారులను అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా వైసీపీ శ్రేణులు తమ నిరసనలను కొనసాగించాయి.

విజయవాడ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ముఖ్యంగా 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి కీలక హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో నిరసనల్లో పాల్గొనడం ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ నాయకులు మాట్లాడారు. ఆసరా, చేయూత, ఇంటి స్థలాల పంపిణీ, వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు నేరుగా సేవలు అందించామని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆ సంక్షేమ దృక్పథం కనిపించడం లేదని ఆరోపించారు.

అదే సమయంలో విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడిందని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రజల సమస్యలపై తమ పోరాటం ఇక్కడితో ఆగదని, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఇందులో భాగంగా జూన్ 8న టౌన్ హాల్ సమావేశాలు, జూన్ 12న జిల్లా స్థాయిలో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు నిర్వహించిన ఈ నిరసనలు వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, అధికార కూటమిపై రాజకీయ ఒత్తిడిని పెంచే ప్రయత్నంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో ఈ ఆందోళనలు మరింత ఉధృతమవుతాయా లేదా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed