ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. పంజాబ్‌పై ఘన విజయం ! | క్రీడా వార్తలు | ACTPnews

credit:x


Last Updated:

ఐపీఎల్ 2026లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ సూపర్ విక్టరీతో బెంగళూరు జట్టు దర్జాగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి అభిమానుల్లో ఆనందం నింపింది.

credit:x
credit:x

ధర్మశాల వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సత్తా చాటింది. పంజాబ్ కింగ్స్‌పై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఐపీఎల్ 2026లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. విరాట్ కోహ్లీ 58 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సులు), వెంకటేశ్ అయ్యర్ 73 (8 ఫోర్లు, 4 సిక్సులు) వేగంగా పరుగులు చేయడంతో పంజాబ్ కు పెద్ద టార్గెట్ సెట్ చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన పంజాబ్.. ఆరంభం నుంచే చతికిల పడింది. టాప్ ఆర్డర్ మొత్తం విఫమవ్వడంతో జట్టుకు ఓటమి తప్పలేదు.

ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (0), ప్రభుసిమ్రన్ సింగ్ (2) తక్కువ పరుగులకే ఔటయ్యారు. కూపర్ శ్రేయస్ అయ్యార్ (1) మరోసారి నిరాశపరిచాడు. కూపర్ కొన్నోలీ (37), సూర్యాన్ష్ షెగ్దే (35), మార్కస్ స్టోయినల్ (37) పర్వాలేదనిపించినా.. కావాల్సిన రన్ రేట్‌కు తగ్గట్టుగా వేగంగా పరుగులు చేయలేకపోయారు.

చివర్లో శశాంక్ సింగ్ 56 (4 ఫోర్లు, 4 సిక్సులు) హాఫ్ సెంచరీతో చెలరేగినా.. అప్పటికే మ్యాచ్ చేయిదాటిపోయింది. ఇక ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా.. భువీ 2, హేజెల్ వుడ్, షెపర్డ్, సుయాష్ శర్మ చెరో వికెట్ తీసుకున్నారు. ఇది పంజాబ్ జట్టుకు వరుసగా ఆరో ఓటమి. దీంతో ప్లేఆఫ్స్ బర్తీ మరింత కష్టంగా మారింది. ప్రస్తుతం 13 పాయింట్లతో పంజాబ్ 4వ స్థానంలో ఉంది. ఐతే, ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండటంతో ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కచ్చితంగా చివరి మ్యాచ్ గెలివాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *